వేదిక ఏదైనా సరే తమలోని టాలెంట్ ను బయటపెట్టేలా చేస్తున్నారు నవతరం కళాకారులు.. ఒకప్పుడు కేవలం నలుగురికి మాత్రమే చూపించే తమ టాలెంట్ ను ఇప్పుడు ప్రపంచ నలుమూలలా చూపించేలా చేసే యాప్ వచ్చింది. అదే మొబైల్ యాప్ టిక్ టాక్. దీని వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అన్ని అప్రయోజనాలు ఉన్నాయి.  


అందుకే చెన్నై హై కోర్ట్ కొద్దిరోజులు దీన్ని వాడొద్దని చెప్పింది. అయితే ఫైనల్ గా మళ్లీ ఆ తీర్పు సవరించుకుందని తెలిసిందే. ఇదిలాఉంటే టిక్ టాక్ వల్ల కొంతమందికి ముఖ్యంగా టాలెంటెడ్ పీపుల్స్ కు అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు. అవకాశం ఇచ్చే వాళ్లు.. అవకాశం కోసం ఎదురుచూసే వాళ్లు ఇలా ఇద్దరికి ఈ టిక్ టాక్ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.


పాటైనా.. ఆటైనా.. డైలాగ్ అయినా.. కామెడీ అయినా నీలో ఏదైనా టాలెంట్ ఉంటే అది ఎవరో ప్రమోట్ చేసుకోవడం కాదు నీకు నువ్వే ప్రమోట్ చేసుకోవచ్చు. నిజమైన టాలెంట్ కు టిక్ టాక్ లాంటి యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఇలాంటి యాప్ ని తప్పుగా వాడుకునే వారు ఉన్నారు.


టిక్ టాక్ తెలుగులో రెండు రాష్ట్రాల యువకులు యాక్టివ్ గా ఉంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వారు చేసే ఏ యాక్టివిటీ అయినా ప్రపంచానికి తెలియచెప్పేలా చేస్తున్నారు. ఇక ఇందులో గ్రూపులు.. బ్యాచ్ లు.. వార్నింగులు.. ఇలాంటివి కూడా కామన్ అయ్యాయి. ఇవన్ని పక్కన పెడితే టిక్ టాక్ వల్ల టాలెంట్ హంట్ జరుగుతుంది. ముందు చెప్పినట్టుగా అవకాశం ఇచ్చే వారికి ఎక్కడెక్కడో వెతక్కుండా టిక్ టాక్ లో మంచి టాలెంట్ చూపిన వారికి షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్, సినిమా అవకాశాలు ఇస్తున్నారు. ఇది కచ్చితంగా మంచి ప్రయత్నమని చెప్పొచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: