మహర్షి సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చింది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సరిగ్గా 12 గంటలకు మహేష్ 26వ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. మహేష్ 26వ సినిమా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా ప్రచారంలో ఉన్నట్టుగా సరిలేరు నీకెవ్వరు ఫిక్స్ చేశారు.  


టైటిల్ పోస్టర్ తో మహేష్ సర్ ప్రైజ్ చేశాడని చెప్పొచ్చు. సరిలేరు నీకెవ్వరు ఇదో ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుందని టైటిల్ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను జి.ఎం.బి ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయనే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయడం విశేషం.


పటాస్ నుండి ఎఫ్-2 వరకు సూపర్ హిట్లు కొట్టిన అనీల్ రావిపుడి ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరి. పవర్ ఫుల్ టైటిల్ తో పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. మహర్షి సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నారు. 


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూన్ సెకండ్ వీక్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. టైటిల్ పోస్టర్ లోనే 2020 సంక్రాంతి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. సో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు వచ్చే సంక్రాంతి మరింత డబుల్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: