ఎన్టీఆర్ కథానాయకుడు' మరియు 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా ఫలితం బాలయ్యకు పెద్ద షాక్ అని చెప్పాలి. రెండు పార్ట్ లు కలిసి 100 కోట్లు రాబట్టడం ఖాయం అంటూ అంతా అనుకుంటే అందులో కనీసం ఇరవై శాతం కూడా రాబట్టలేక పోయిందని ట్రేడ్ వర్గాల నుండి టాక్. ఎన్టీఆర్ చిత్రంను బాలకృష్ణ చేయాలనుకున్నప్పుడు పలువురు దర్శకులను పరిశీలించి చివరకు తేజతో సినిమా అనుకున్నారు.


తేజ దర్శకత్వం అంటూనే సినిమా ప్రారంభ కార్యక్రమాలు జరిగాయి. మొదటి షాట్ కు క్లాప్ కూడా పడింది. కాని ఎన్టీఆర్ బయోపిక్ కు తాను న్యాయం చేయలేనేమో అంటూ తేజ తప్పుకున్నారు. తేజ స్థానంలో క్రిష్ వచ్చారు. క్రిష్ ఎంట్రీతో ఎన్టీఆర్ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. తప్పకుండా క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంటుందని అనుకున్నారు. కాని ఫలితం తారు మారు అయ్యింది. ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ రియాక్షన్ ఏంటా అంటూ ఒక విలేకరి ప్రశ్నించిన సమయంలో ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు.


నాకు ఆయ‌న‌తో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. అంత‌టి లెజండ్రీ గురించి సినిమా తీస్తున్న‌ప్పుడు కాస్తో కూస్తో ప‌రిచ‌యం ఉంటే అది వేరేలా ఉంటుంద‌ని అన్నారు. అంతేకాక ఆయ‌న ఈ చిత్రాన్ని తీసిఉంటే దానిఫ‌లితం ఇంకా దారుణంగా ఉండేదేమో అని కూడా అన్నారు. ఎన్టీఆర్ సినిమాను నేను చూడలేదు. ఒకవేళ నేను చూసి ఏదైనా మీడియా సమావేశంలో ఆ సినిమా గురించి ఉన్నది ఉన్నట్లుగా అని తప్పుగా మాట్లాడితే పెద్ద గొడవ అవుతుంది. అందుకే నేను సినిమా చూడకుండా ఉండటమే బెటర్ అనుకుంటున్నాను అంటూ తేజ చెప్పుకొచ్చారు. అంతేకాక ఆయ‌న‌కు ఓ కోరిక ఉందంట ఎప్ప‌టికైనా ఆయ‌న నిర్మాత‌గా కొంద‌రి ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయాల‌నుకుంటున్నార‌ట‌. అది ఒక‌టి రామ్‌గోపాల్‌వ‌ర్మ‌, వంశీపైడిప‌ల్లితో తీయాల‌నుకుంటున్నార‌ని ఆయ‌న మ‌న‌సులో మాట చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: