తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య.  తమిళ మూవీ గజినీ తెలుగు డబ్బింగ్ అయినప్పటి నుంచి సూర్యకి ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  అలాగే సూర్య కూడా టాలీవుడ్ హీరోలతో మంచి సన్నిహిత సంబంధాలు నడుపుతుంటారు.  తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరిత్యం జరిగినా..వెంటనే స్పందించి విరాళాలు అందిస్తారు.  తాజాగా సూర్య నటించిన ‘ఎన్ జీకే’ తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయ్యింది.  


ఇక  తమిళ ప్రేక్షకుల అభిమానం అందరికీ తెలిసిందే.. రజనీ, అజిత్, విజయ్ చిత్రాల మాదిరిగానే డప్పులు, పాలాభిషేకాల‌తో త‌మ ఆరాధ్య న‌టుడిపై ప్రేమ‌ని చాటుకుంటూ ఈ సారి ఏకంగా తిరుత్తణి- చెన్నై బైపాస్‌ రోడ్డులో 215 అడుగుల సూర్య క‌టౌట్ ఏర్పాటు చేశారు.తిరువళ్లూరు జిల్లాకి చెందిన సూర్య ఫ్యాన్స్ ఈ కటౌట్ కోసం సుమారు రూ.7 లక్షలు ఖర్చు పెట్టగా 35 రోజుల పాటు, సుమారు 40మంది కార్మికులు కష్టపడి ఈ కటౌట్‌ని ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే..ఇప్పుడు ఆ కటౌట్ కి అడ్డంకులు ఏర్పడ్డాయి. బతికున్న వారి విగ్రహాలు, కటౌట్‌లు పెట్టకూడదు, వెంటనే సూర్య కటౌట్‌ను అక్కడినుండి తొలగించాలని మద్రాసు హైకోర్ట్ తీర్పునిచ్చింది.  అంతే కాదు గతంలో ఇలాంటి కటౌట్ లకు పాలాభిషేకం చేస్తూ ఓ ఫ్యాన్ కిందపడిపోయిన చనిపోయారు..ఈ విషయాలన్ని పరిణలోకి తీసుకొని కోర్ట్, ఎన్‌జీకే కటౌట్‌ని తొలగించమని చెప్పడంతో దానిని చెన్నై మునిసిపాలిటీ అధికార్లు తొలగించారు.

ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ అక్కడకు వచ్చి నానా రబస చేశారు..తమ అబిమాన నటుడికి అవమానం అంటూ రచ్చ రచ్చ చేశారు.   వేరే హీరోల అభిమానులు ఏర్పాటు చేసినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా తొలగిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: