పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసం తర్వాత సినిమాలు ఆపేశాడు. జనసేన తరపున ఏపి ఎలక్షన్స్ లో ప్రక్షాళణ చేద్దామని అనుకున్నా ఏపి ప్రజలు జగన్ కే ఓటేయడంతో ఢీలా పడ్డాడు పవన్ కళ్యాణ్. ఇక మళ్లీ పవర్ స్టార్ గా సినిమాలు చేయడమే బెటర్ అని కొందరు సలహాలు ఇస్తున్నారు. తను ఇప్పుడప్పుడే సినిమాలు చేసేది లేదని పవన్ చెబుతున్నా అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు అతని వెంట పడుతూనే ఉన్నారు.


పవన్ సినిమా చేస్తాడు కాని దానికి కొద్దిగా టైం ఉందట.. అది ఎంత అన్నది తెలియదు తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది పవన్ సినిమా చేయొచ్చట. అయితే ఈసారి సినిమా అంటూ తీస్తే సమాజానికి ఉపయోగపడే కథలే చేయాలని నిర్ణయించుకున్నాడట. అలాంటి కథలు చేస్తేనే పవన్ పొలిటికల్ ఇమేజ్ కు హెల్ప్ అవుతుంది.


సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. కాని మైక్ ముందు వీరావేశంలో మాట్లాడే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే స్టైల్ కు ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నాడు. అందుకే ఈసారి కథ చాలా పవర్ ఫుల్ గా పవర్ స్టార్ స్టామినా తెలియచేసేలా ఉండాలని చెబుతున్నాడట. అలాంటి కథ వస్తే అప్పుడు సినిమా చేస్తానని చెబుతున్నాడట.


కోలీవుడ్ లో విజయ్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ ఇష్యూ మీద కథ ఉండేలా చూసుకుంటాడు. రాబోయే కాలంలో అతను కూడా సినిమాల్లోకి వస్తాడని టాక్. అయితే అలానే పవన్ కూడా సినిమాలు కూడా పొలిటికల్ ఇమేజ్ కాపాడేలా చేసుకుంటే బెటర్ లేదంటే సినిమాల ఫలితాలు కూడా తేడా కొట్టే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: