వరుస ఫ్లాప్ లతో ఉన్న సూర్య ఎలాగైనా ఈ సారి గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఏ దర్శకుడితో జత కట్టాలి...అని బాగా ఆలోచించి  చివరికి సెల్వ రాఘవన్ తో ఫిక్సై ఎన్.జి.కె చేశాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే అటు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ ఎంతో ఆత్రుతగా ప్రేక్షకులు ఎదురు చూశారు. అందులోనూ పొల్టికల్ బ్యాగ్డ్రాప్ లో కథ, సూర్య పక్కన నేచురల్ లేడీ స్టార్ సాయి పల్లవి, గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించడంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో హైప్ క్రియోట్ అయింది. అయితే రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాగా డిసప్పాయింట్ చేసింది. ప్రేక్షకులనే కాదు సూర్యను ఘోరంగా డిసప్పాయింట్ చేసింది. 


అసలే గత కొంతకాలంగా మార్కెట్ పడిపోతుందని బాగా ఫీలవుతంటే ఎన్.జి.కె రూపంలో సూర్య కు మరో గట్టి దెబ్బ పడింది. సెల్వ పై ఎంతో నమ్మకం పెట్టుకొని డేట్స్ ఇస్తే తన ఇమేజ్ ని ఘోరంగా డామేజ్ చేశాడని, ఫ్లాప్స్ తో సతమమవుతున్న నాకు మరో డిజాస్టర్ ను ఇచ్చాడని ఫీలవుతున్నాడట. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ సాయి పల్లవి, రకుల్ మొన్నటి వరకు సెల్వ సూపర్ డైరెక్టర్ అని మీడియా సమావేశంలో తెగ పొగిడారు. అయితే సినిమా రిలీజైయ్యాక వాళ్ళ ఆశలు ఆవిరైపోయాయి. 


మొత్తానికి ఈ సినిమా సూర్యకి పైసా వంతు కూడా ఉపయోగపడలేదని తమిళ ఇండస్ట్రీ సమాచారం. ఇప్పటికే ఫ్లాప్స్ తో సతమమవుతున్న నాకు మరో డిజాస్టర్ ను ఇచ్చాడని ఫీలవుతున్నాడట. ఎందుకంటే దర్శకుడు సెల్వ రాఘవన్.. ఎక్కడా తన ముద్రను చూపించలేదు. ఒకప్పుడు అతను ఫ్లాప్ తీసినా.. ఏదో ఒక ప్రత్యేకత ఉండేది. అతను ఎలాంటి కథ ఎంచుకున్నా.. ఎక్కడో ఒక చోట సర్ ప్రైజ్ చేస్తాడని.. నరేషన్ కొత్తగా ఉంటుందని ఆశించి థియోటర కి వెళతారు. ఐతే సెల్వ టచ్ ఎంతమాత్రం లేని సినిమాగా 'ఎన్జీకే'ను తెరకెక్కించి. కథ.. స్క్రీన్ ప్లే.. దర్శకత్వం.. ఇలా అన్ని విభాగాల్లోనూ సెల్వ రాఘవన్ నిరాశ పరిచాడట.    


మరింత సమాచారం తెలుసుకోండి: