ప్రస్తుత పరిస్థుతులలో తెలుగుదేశం పార్టీని రక్షించగల ఏకైక శక్తి జూనియర్ మాత్రమే అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ తెలుగుదేశం వర్గాలలో ఆలోచనలు కలిగిస్తూ ఉంటే జూనియర్ అభిమానులు మాత్రం జోష్ లోకి వెళ్ళిపోయారు. తమ యంగ్ టైగర్ 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలి అంటూ వేల సంఖ్యలో జూనియర్ కు మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్.

ఈ అనూహ్య స్పందన చూసి జూనియర్ సన్నిహితులు కూడ ఆనంద పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు తప్ప మరే విషయం పట్టించుకోనని జూనియర్ పైకి అంటున్నా లోలోపల ఈ అనూహ్య స్పందన అతడిలో కూడ ఆశలు రగిల్చే అవకాసం ఉంది అని అంటున్నారు. 

అయితే ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు జరిగిన ఘోర పరాభవం జూనియర్ మనసులో పుట్టిన ఆశలను ఎదగనివ్వదని కొందరి అభిప్రాయం. రాజకీయాలలోకి రమ్మని పిలిచే అభిమానులు తీరా రాజకీయాలలోకి వచ్చాక తమ హీరోలను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే సంఘటనలు చిరంజీవి పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన నేపధ్యంలో ఆవిషయాలు జూనియర్ కు పాఠాలు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  

ప్రస్తుత పరిస్థుతులలో ప్రజలు సినిమాలు రాజకీయాలు అంటూ రెండు పడవల సిద్దాంతం కొనసాగించే వారిని విశ్వసించడం లేదు. దీనితో పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో చెప్పిన మంచి మాటలను కూడ ఓటర్లు విశ్వసించలేదు. ఇలాంటి పరిస్థుతులలో 2024కు కనీసం 45 సంవత్సరాలు కూడ నిండని జూనియర్ రాజకీయాలలో సాహసం చేయడనీ ఏదైనా అటువంటి ఆలోచనలు జూనియర్ వైపు నుండి రావాలి అంటే అది కేవలం 2029కి మాత్రమే అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అప్పటికి రాజకీయాలలో ఎన్నో మార్పులు వచ్చే తరుణంలో జూనియర్ పై వర్మ చేసిన కామెంట్స్ ఎలాంటి ప్రభావానికి అవకాశాలు లేవు అంటూ విశ్లేషకుల అభిప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: