అందం గురించి చెప్పాలి అంటే ప్రకృతిని  చూపిస్తాం... లేదంటే ప్రకృతిలో సగభాగమైన అమ్మాయిని చూపిస్తాం.  అందం అంటే అమ్మాయి అనే అర్ధం కూడా ఉందికాదా మరి.  అందానికి పెద్దపీట వేసే రంగాల్లో సినిమా రంగం ఒకటి.  సినిమాల్లో నటించాలి అంటే ముఖ్యంగా గ్లామర్ ఉండాలి.  గ్లామర్ తో ఆకట్టుకోవాలి.  అభినయంతో దుమ్మురేపాలి. 


ఒక్కోసారి ఇవేమి అవసరం లేదు.  గ్లామర్ ఉన్నా సరిపోతుంది.  పేస్ లో ఏదో ఎట్రాక్షన్ అన్నది కంపల్సరీ.  అందుకే హీరోయిన్లు స్పెషల్ గా కనిపించేందుకు ఉత్సాహం చూపుతుంటారు.  చందమామలా కనిపించేందుకు ఇష్టపడుతుంటారు.  చందమామ అంటే గుర్తుకు వచ్చింది... చందమామ అంటే కాజల్ ను చూపిస్తుంది గూగుల్ తల్లి.  చందమామ ఎంత అందంగా ఉంటుందో... కాజల్ కూడా అంతే అందంగా ఉంటుంది.  పెద్దవైన కళ్ళు... పెదవులపై చెరగని చిరనవ్వు... అమాయకమైన పేస్ ఇవన్నీ స్పెషల్ ఎట్రాక్షన్సే. 


సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు... ఇండస్ట్రీలో ఎంతగా కష్టపడుతుందో.  మేకప్ తీయడానికి కూడా సమయం లేనంతగా బిజీగా మారిపోయింది.  అసలు కాజల్ మేకప్ లేకుండా ఎలా ఉంటుంది.  ఎవరైనా చూశారా.  చూడలేదనే అంటారు.  అందుకే కాజల్ స్వయంగా మేకప్ లేకుండా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  


లేయర్లలాంటి మేకప్ ఏది వేయకుండా ఎలాంటి పౌడరు గట్రా అడ్డకుండా న్యాచురల్ గా ఉన్న ఫోటో.  ఫోటో చూశాక అందరు షాక్ అయ్యారు.  అందరు ఏంటి కాజల్ కూడా షాక్ అయ్యే ఉంటుంది.  ఎందుకంటే, తనను అలా చూసుకొని ఎన్ని రోజులైవుంటుందో.  కావాలంటే మీరు ఆ ఫోటోను చూడండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: