ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఆర్ ఆర్ఆర్ సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కావటం కష్టమేనని సినిమా వర్గాల ఇన్ సైడ్ టాక్. మామూలుగానేరాజమౌళి సినిమా అంటే అనుకున్న సమయానికి రిలీజ్ చేయడనే అపవాదు ఇండస్ట్రీలో ఉంది. దానికి తోడుఎన్టీయార్ రామ్ చరణ్ గాయాల పాలవటంతో షూటింగ్ సజావుగా సాగటం లేదు.


హైదరాబాద్ నగరం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎన్టీయార్పై కొన్ని దృశ్యాలు చిత్రీకరించవలసి ఉన్నప్పటికీఎన్టీయార్ ఇంకా గాయం నుండి పూర్తిగా కోలుకొలేదు. రామ్ చరణ్ ఉపాసనతో సమ్మర్ వెకేశన్లో ఉండటంతో ఈషెడ్యూల్లో రామ్ చరణ్ జాయిన్ అవటానికి ఇంకా చాలా సమయం పడుతుంది.


హీరోయిన్ల ఎంపిక కూడా ఆర్ ఆర్ చిత్రం ఆలస్యం అవ్వటానికి మరొక కారణం. రామ్ చరణ్ కు హీరోయిన్గాఅలియా భట్ ఎంపికయినప్పటికీ ఎన్టీయార్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుండి తప్పుకోవడంతోరాజమౌళి ఇంకా హీరోయిన్ల వేటలోనే ఉన్నాడు. నిత్యా మీనన్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈసినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇన్ని సమస్యల మద్య  ఈ  సినిమా జులై 30 2020 నాటికి రిలీజవుతుందో లేక విడుదల తేదీ వాయిదా వేస్తారో చూడాలి


అంచనాలు అందుకోని మే నెల


టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎప్పుడూ 15 నుండి 20 % మద్యలో ఉంటుంది. కొన్ని సార్లు రాంగ్ టైమ్లోరిలీజ్ వల్ల సినిమాలు ఫ్లాప్ అయితే మరి కొన్ని సార్లు సీజన్ ని క్యాష్ చేసుకోలేక సినిమాలు బోల్తాపడతాయి.అలాగే ఈ సమ్మర్ సీజన్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ మాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకటీ అరాసినిమాలు హిట్టయినప్పటికీ అవి భారీ రేంజ్ హిట్లు కాదు.


మే నెల మొదటివారంలో రిలీజైన ఒకటే లైఫ్, రష్మిక గీతా చలో, నువ్వు తోపురా సినిమాలు ఒకదానిని మించిమరొకటి డిజాస్టర్లు అయ్యాయి. మే రెండో వారంలో మహర్షి సినిమా ఉండటంతో కీ అనే చిన్న సినిమా తప్పఇంకో సినిమా రిలీజ్ కాలేదు. మహర్షి మొదటి వారంలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ చాలా ఏరియాలోబ్రేక్ ఇవెన్ కాకపోవటంతో అబవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది.


మే మూడవ వారంలో రిలీజైన ఎంతవారలైనా, రొమాంటిక్ క్రిమినల్స్ ఫ్లాప్ కాగా అల్లు శిరీష్ ఎ బి సి డి మొదటిరోజు వసూళ్ళతో సరిపెట్టుకుంది.మే నాలుగవ వారంలో ఎన్నో అంచనాలతో వచ్చిన సీత ప్రేక్షకులకుచుక్కలు చూపించగా, అల్లాద్దిన్, లిసా , ఎవడు తక్కువ కాదు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు థియేటర్ల నుండివెల్లిపోయాయో కూడా ప్రేక్షకులకు తెలీదు. నిన్న రిలీజైన అభినేత్రి 2, ఎన్జీకె డిజాస్టర్ టాక్ తెచ్చుకోగ ఫలక్నామా దాస్ పరవాలేదనిపించున్కుంది. 15 సినిమాల్లో ఒక్క సినిమా మాత్రమే హిట్టవ్వటంతో టాలీవుడ్సక్సెస్ రేట్ ఇంకా తగ్గినా ఆశ్చర్యం లేదు


మరింత సమాచారం తెలుసుకోండి: