హాలీవుడ్ సినిమాలు అంటేనే యాక్షన్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి.  యాక్షన్ సినిమాలు నచ్చే వాళ్ళు రాంబో సిరీస్ సినిమాలు ఇప్పటికే చూసి ఉంటారు.  రాంబో సిరీస్ లో ఇపుడు మరో సినిమా వస్తున్నది.  అదే రాంబో లాస్ట్ బ్లడ్.  సిల్వెస్టర్ స్టాలోన్ హీరో.  యంగ్ గా ఉన్నప్పుడు తన యాక్షన్ తో అదరగొట్టిన స్టాలోన్, వయసు పైబడిన తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఎలా చేస్తాడా అని అందరికి డౌట్ రావొచ్చు.  

వయసు శరీరానికేగాని, మనసుకు కాదు అని చెప్పి రాంబో ద్వారా మరోసారి నిరూపించబోతున్నాడు.  వియాత్నం సైనికుడిగా కనిపించిన స్టాలోన్, తన కూతురిని మెక్సికన్ డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేసిన తరువాత, వాళ్ళ నుంచి కూతురుని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు అన్న స్టోరీతో సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  

రాంబో యాక్షన్ ఏ మాత్రం తగ్గలేదు.  పైగా కథలో ఎమోషన్ ఉండటంతో తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతున్నది.  సెప్టెంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెర్ఫెక్ట్ గా ఉండటంతో రాంబో బాక్సాఫీస్ వద్ద విజృంభన ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.  రాంబో సినిమాలకు ఇండియాలోనూ ఫాన్స్ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: