హైలీ డిమాండింగ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే మొదట స్పురించే పేరు జిగేల్ రాణి పూజా హెగ్డే. ఈ మధ్య రిలీజ్ అయిన సూపర్-స్టార్ మహేష్ బాబు తో ఈ ఈ కన్నడ కస్తూరి,  అందాల బొమ్మ జోడీ కట్టిన సినిమా మహర్షి  ఘన విజయం సాధించింది. హిందీ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నా ఈ వయ్యారి భామ రీసెంట్ గా "జీక్యూ మ్యాగజైన్"  నిర్వహించిన "జీక్యూస్ 100 బెస్ట్ డ్రెస్డ్" కార్యక్రమానికి హాజరైంది. ఏదో సాదా సీదా కార్యక్రమాలకే సూపర్ డ్రెస్సుల్లో వస్తుంది ఈ భామ.  బెస్ట్-డ్రెస్ లు వేసుకొచ్చే కార్యక్రమం కావడంతో దీనిపై తను కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
Actress Pooja Hegde
ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక శాటిన్-డ్రెస్ లో మిలమిలా మెరిసింది పూజా హెగ్డే. స్లీవ్ లెస్ టాప్ దానికి ఫ్రంట్ ఓపెన్ విండో ఉంది. అసలే ఎండా కాలం చక్కగా గాలి ఆడేందుకు ఆ డిజైనర్ ఇలా డిజైన్ చేసినట్టున్నాడు. సహజంగా ఇలాంటి టాప్స్ డిజైన్ చేసిన సమయంలో మెడ దగ్గర కాలర్ డిజైన్ చేయరు. ఈ డ్రెస్ కు మాత్రం మెడకు నెక్లెస్ లాగా డిజైన్ వచ్చింది. ఇక బాటమ్ కూడా అదే క్లాత్, అదే కలర్ లో ఆకర్షణీయంగా డిజైన్ చేయడంతో పూజ వయ్యారాలు వగలు వలికిస్తూ సోయగాలు చిందిస్తూ జిగేల్ మంటూ యువతకు నిద్రపట్టనివ్వని విధంగా మెరిసిపోతోంది. 
Image result for GQ 100 best dressed 2019 pooja hegde
కనిపించాల్సిందంతా కనిపిస్తుంటే ఇంకా ఆభరణాలు ఎందుకు? అందుకే ఆభరణాలు అసలే మాత్రం ధరించకుండా, మినిమమ్ మేకప్ తో నడుము మీద చేతులు పెట్టుకొని స్టైల్ గా నిలబడింది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా అతిథుల కళ్ళన్నీ మన సొగసరి భామ పూజ మీదకే వెళ్ళి ఉంటాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.  
పూజ హేగ్డే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలను లైన్లో ఇప్పటికే పెట్టేసింది. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమా. ఇది కాకుండా బాలీవుడ్ లో "హౌస్ ఫుల్ 4" సీరిస్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Related image
మనకున్న అందాల భామల్లో ఏమీ దాచుకోకుండా నిరభ్యంతరంగా నటించే ఈ కన్నడ హరి చందనం సినిమాలు ఆర్ధికంగా హిట్ కాకపోయినా కొత్త సినిమాల్లో నటింప జేసుకోవటానికి దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతుంటారు. అసలే సినిమాలు వరసగా ఫట్ అవుతున్న తరుణంలో ఈ మధ్య రిలీజ్ అయిన సూపర్-స్టార్ మహేష్ బాబు మహర్షి పూజా హెగ్డే కు మరో ఐదారు సినిమాలకు తక్కువ గాకుండా బుకింగ్స్ వచ్చేలా చేసింది.
 Related image

మరింత సమాచారం తెలుసుకోండి: