సినీ పరిశ్రమలో హర్రర్ కాన్సెప్ట్ సినిమాకే కొత్తదనం తీసుకు వచ్చారు లారెన్స్ రాఘవ.  ముని సినిమా మంచి హిట్ అయ్యింది..ఆ తర్వాత కాంచన, గంగ, కాంచన 3 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు.  కాంచన సినిమా కన్నడలో రిమేక్ అయ్యింది...ఇప్పుడు బాలీవుడ్ లో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో ఈ సినిమా పేరు లక్ష్మీబాంబ్ అనే టైటిల్ పెట్టారు. 


అయితే  లక్ష్మీబాంబ్ చిత్ర యూనిట్ లారెన్స్ ని సంప్రదించకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.  దాంతో మనస్తాపానికి గురైన లారెన్స్ లక్ష్మిబాంబ్ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వివాదాల పరిష్కారం కావడంతో తాజాగా లారెన్స్ లక్ష్మి బాంబ్ మూవీలోకి వచ్చేశాడు. ఈ విషయాన్ని లారెన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నా ఫీలింగ్స్ అర్థం చేసుకుని సమస్యని పరిష్కరించిన అక్షయ్ కుమార్ సర్ కు కృతజ్ఞతలు. 


అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత లారెన్స్ ని బుజ్జగించే ప్రయత్నాలు హీరో అక్షయ్ కుమార్ తో సహా సినీ నిర్మాతలు ఏకంగా చెన్నైకే వచ్చి చర్చలు జరిపినట్లు సమాచారం. కట్ చేస్తే అక్షయ్ కుమార్ జోక్యం తో హిందీ నిర్మాతలు దిగొచ్చారు.   ఈ నేపథ్యంలో లారెన్స్ మనసు మార్చుకున్నారు.  నిర్మాత షబీనా ఖాన్ కు కూడా కృతజ్ఞలు. వీరిద్దరూ నాకు గౌరవం ఇచ్చారు.


ఈ మూవీకి పనిచేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని లారెన్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సమయంలో తనకు అక్షయ్ కుమార్ తో ఎటువంటి విభేదాలు లేవని లారెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.






మరింత సమాచారం తెలుసుకోండి: