గత కొన్నాళ్ళుగా పరిణామాలు చూస్తే టాలీవుడ్లో హిట్ల శాతం బాగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పటికి ఆరు నెలలు గడిచాయి. కానీ సరైన హిట్లు అంటే పెద్దవి రెండే కనిపిస్తాయి. అవి ఎఫ్ 2, మహర్షి. మిగిలినవి ఉన్నా భారీ హిట్లుగా వీటినే చూడాలి. ఇక డిజాస్టర్ల సంగతి చెప్పనవసరం లేదు. బాగులేకపోతే మార్నింగ్ షో నుంచే జెండా ఎత్తేయాల్సిందే.



ఈ పరిస్థితుల్లో వస్తున్న పరాయి భాషా చిత్రాలకు కూడా కాలం చెల్లిందనిపిస్తోంది. రజనీ మానియా ఎంత ఉన్నా అయన  సినిమా 2.0 తెలుగు రాష్ట్రాలో పెద్దగా  ఆడలేదు. ఇక విజయ్ వంటి హీరోల మార్కెట్ చెల్లాచెదురైంది. కార్తీక్ డబ్బింగ్ సినిమాలు ఆ మధ్యన  బాగానే ఆడాయి. ఇపుడు మాత్రం ఫట్ అనిపించేశాయి.అన్నింటికీ మించి వింత ఏంటి అంటే సూర్యాకు టాలీవుడ్లో  మంచి మార్కెట్ ఉంది. అటువంటి సూర్య లేటెస్ట్ మూవీ ఎంజీకే డిజాస్టర్ అయింది.


అలాగే ప్రభుదేవా, తమన్నా నటించిన అభినేత్రి 2 కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ రిజల్ట్స్ చెప్పేది ఏంటంటే విషయం లేకపోతే ఎంత తోపుల డబ్బింగ్ మూవీలైనా ఇంతేనని. తెలుగు హీరోలకే రెండో ఆటకు దిక్కులేని చోట డబ్బింగ్ హీరోలు వచ్చి హడావుడి చేస్తే కుదురుతుందా. ఒకప్పుడు డబ్బింగ్ మూవీస్ దే రాజ్యం. ఇపుడు మాత్రం ఎందుకో ప్రతీ సినిమా ఇక్కడ ఫట్ అవుతోంది. చూడాలి ఎందుకిలా జరుగుతోందో.


మరింత సమాచారం తెలుసుకోండి: