ఈ మద్య వస్తున్న సినిమాల్లో కంటెంట్ తక్కువ కవరింగ్ ఎక్కువగా ఉన్నాయి.  కథాకమామిషు సంగతి దేవుడెరుగు..నాలుగు ముద్దు సీన్లు..ఐదు బెడ్ రూమ్ సీన్లు..కాస్త సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు కామెడీ తో ఓ సినిమా కవర్ చేయవొచ్చు అనే మూస దోరణిలో సాగిపోతుంది.  ఇలాంటి వాటిలో అప్పుడప్పుడు ఆణిముత్యాల్లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి..అది వేరే విషయం.  కాకపోతే ఇలాంటి బోల్డ్ కంటెంట్..సీన్లు ఉన్న సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు రావడం మరో విశేషం.


బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలో ఈ మద్య తప్పకుండా ఓ ఘాటైన్ ముద్దు సీన్లు తప్పకుండా పెడుతున్నారు..హీరో హీరోయిన్ల మద్య రొమాన్స్ సన్నివేశాల్లో ఇలాంటి లిప్ లాక్ సీన్లు ఉండటం పరిపాటైంది.  అయితే  దాదాపు మూడు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సల్మాన్ ఖాన్ మాత్రం వీటికి దూరంగానే ఉంటూ వస్తున్నాడు.  


తాజాగా భారత్ మూవీ ప్రమోషన్ సందర్బంగా సల్మాన్ ఖాన్ ఈ ముద్దు విషయంపై స్పందించారు.  తెరపై ముద్దు సన్నివేశాలు వచ్చినప్పుడు కొందరు తల తిప్పుకుంటారని... అది ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు ట్రెండ్ మారిందని... ముద్దు సీన్లను ప్రేక్షకులు కూడా లైట్ తీసుకుంటున్నారని... అయినప్పటికీ, తాను అలాంటి సీన్లలో నటించలేనని చెప్పాడు. ఏ సినిమాలో నైనా రొమాంటిక్ సీన్లు ఉంటాయని..అలా అని ముద్దు సీన్లు ప్రాధాన్యత కాదని సల్మాన్ అంటున్నారు.  తాను నటించిన సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో ముద్దు సీన్లతో నటించమని కొందరు దర్శకులు తనను అడిగారని... తాను ఒప్పుకోలేదని తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: