శ్రియా హాట్ బ్యూటీ, ఇష్టం మూవీతో తెలుగులో తెరంగ్రేట్రం చేసిన ఆమె స్టార్ హీరోయింగా ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోలతో టాప్ లేపింది. శ్రియ జోడీ అప్పట్లో సూపర్ హిట్.  ప్రభాస్, జూనియర్ ఎంటీయర్ తో వేసిన డ్యాన్సులు కుర్రకారుకు కిర్రెక్కంచాయి.


ఇండస్ట్రీకి పరిచయమై రెండు దశాబ్దాలు దాటింది. మూడు పదుల పైబడి వయసు. అయినా అయస్కాంతంగా ఆ సొగసు ఆకట్టుకుంటూనే ఉంది. యూత్ ని ఢీ కొట్టుతూనే ఉంది. శ్రియా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు పెంచింది. బాలయ్యతో గౌతమీ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చేసి మళ్ళీ ఫామ్  లోకి వచ్చింది. నాగార్జునతో మనం, వెంకటేష్ తో గోపాల గోపాల మూవీస్ చేసిన ఈ అమ్మడు ఈ మధ్యనె పెళ్ళి చేసుకుంది. అయినా ఎక్కడా తగ్గన్నట్లుగా హాట్ ఫోజులకు రెడీ అంటోంది.

ఇక పెళ్ళి అయింది. పిల్లలు ఎపుడు అంటే శ్రియా దీర్ఘాలు తీస్తోంది. ఓ ఇరవై ముప్పయి సినిమాల్లో నటించిన తరువాతనే పిల్లలను కంటాను అంటోంది. అంటే కచ్చితంగా మరో అయిదారేళ్ళ వరకూ ఆ వూసే ఉండదన్నమాటేగా. ఏది ఏమైనా ఫిజిక్ ని బాగా మెయింటెయిన్ చేస్తున్న శ్రియను చూస్తే ఇంకా పెళ్ళి అయిందను అనుకోరు. మరి పిల్లలు అంటే ఆంటీ  అయిపోదా అందుకే ఈ ముందు జాగ్రత్త. అవును శ్రియకు తెలుగులో అన్ని మూవీస్ ఉన్నాయా. లేక ఇతర భాషల్లో చేస్తోందా చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: