తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షో “బిగ్ బాస్” షో. అతి తక్కువ సమయంలోనే తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది  “బిగ్ బాస్” షో. ప్రసారమైన రెండో సీజన్లో టీఆర్పీ రేటింగ్స్ బాగానే వచ్చాయి. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కాస్త బోర్ అనిపించినా గాని..బాగానే ప్రేక్షకులు ఆదరించారు.


అయితే ఇటీవల ఐపీఎల్ చేసి ముగియడంతో మూడవ సీజన్ మొదలుపెట్టే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్న క్రమంలో...సడన్గా మూడవ సీజన్ బిగ్ బాస్ షో ఆగిపోయినట్లు వార్తలు బయట వినబడుతున్నాయి. గతంలో బిగ్బాస్ సీజన్ షో జులై నెల నుండి స్టార్ట్ అవుతుందని తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు జూన్ లోకి వచ్చినా సరే ఎలాంటి అప్డేట్స్ తెలీడం లేదు.


దీనితో అసలు ఈసారి బిగ్ బాస్ 3 వ సీజన్ ఉందా లేదాయే అని అంతా అనుకుంటున్నారు.ఇదొక్కటే కాకుండా ఈ షోకు అత్యంత కీలకమైన పార్ట్ హోస్ట్.గత రెండు సీజన్లలో తారక్ మరియు నానీలు కనిపించారు.కానీ ఈ సీజన్లో మాత్రం ఎవరు కనిపిస్తారో అన్నది కూడా ఇంకా తెలీలేదు. మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా సెలబ్రిటీలే ఉండేటట్లు షో నిర్వాహకులు అనుకున్నా వాళ్లు ఒప్పుకోకపోనట్లు ...దీంతో బిగ్బాస్ సీజన్ 3 ఆగిపోయిందనే వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ షో ఆగిపోయిందో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: