నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఐదుగురు ఆడవాళ్ల దొంగల మూఠాకి బాస్ గా నాని నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో నానికి గాయాలైనట్టు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్ లో నాని కాలికి గాయమైందట.


వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లగా చిన్న గాయమే ప్రమాదం ఏమి లేదని చెప్పారట. కాకపోతే కాలికి గాయమవడం వల్ల ఓ 10 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారట. హీరోల లైఫ్ ఎంత హ్యాపీగా అనిపించినా మనల్ని రంజింపచేయడం కోసం వారు చాలా కష్టపడుతున్నారు. ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నంలో ఎలాంటి రిస్కులైనా తీసుకుంటారు.


లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ ఫెయిల్ అవడంతో ఢీలా పడ్డ నాని ఈ ఇయర్ ఇప్పటికే జెర్సీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో నాని నటనకు మరోసారి అతనికి నాచురల్ స్టార్ అన్న స్క్రీన్ నేం ఎందుకు పెట్టారో అర్ధమైంది. సినిమాని నాని తన నటనతో మెప్పించేశాడు. ఇక గ్యాంగ్ లీడర్ తో పాటుగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు నాని.


ఆ సినిమాకు వి అని టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో నాని నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడట. విలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి ఓ ప్రయోగాత్మక సినిమా అని తెలుస్తుంది. గాయాల వల్ల నాని 10 రోజుల పాటు షూటింగ్ కు దూరమవుతాడట. నాని యాక్సిడెంట్ గురించి పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: