టాలీవుడ్ లో ఈ మద్య కొత్త వస్తున్న హీరోయిన్లు..తమ అందమైన ఫోటోషూట్స్ తో అదరగొట్టేస్తున్నారు. నటిస్తున్న సినిమాలు హిట్..ఫ్లాప్ అనే తేడా లేకుండా తమ ఘాటైన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  తెలుగు లో రాజుగాడు, మనసుకు నచ్చింది సినిమాల్లో నటించింది సెక్సీ బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్‌.  ఆ తర్వాత తెలుగు లో కనిపించకపోయినా..బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంది.


అంతే కాదు ఈ బ్యూటీ చూపు ఇప్పుడు కోలీవుడ్ పై కూడా పడిందట. ప్రస్తుతం దర్శకులు, నటులు ప్రభుదేవా తో ఓ సినిమాలో నటిస్తుంది.  తమిళంలో వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో…స్థానిక భాషను నేర్చుకుంటోంది. అంతే కాదు తమిళంలో తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవాలని ప్రయత్నిస్తుంది.  ఈ మద్య వస్తున్న హీరోల పరభాష అయినా సరే నానా తంటాలు పడి ఆ భాష నేర్చుకొని తమ డబ్బింగ్ తామే చెప్పకుంటున్నారు. బాలీవుడ్ లో మెంటల్‌ హై క్యా, మేడ్‌ ఇన్‌ చైనా లాంటి మూవీస్ లో నటించింది. 


ఈ మద్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..థ్రిల్లర్‌ సినిమాల్లో నటిస్తున్నప్పుడు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే సరైన భావోద్వేగాలు మన నటనలో ప్రేక్షకులకు కనిపిస్తాయని అంటుంది ఆ బాలీవుడ్ చిన్నది. అంతే మరి  భాష తెలిస్తే ప్రతిసారీ ఏమన్నారో చెప్పండి అంటూ అనువాదకులను అడగాల్సిన పని ఉండదని బాగానే గమనించింది అమైర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: