సినిమాలలో ప్రస్తుతం లిప్ కిస్ ల ట్రెండ్ బాగా నడుస్తుందని చెప్పాలి. స్టార్స్ సినిమాల నుంచి సి గ్రేడ్ సినిమాల వరకు హీరో హీరోయిన్స్ మధ్య లిప్ లాక్ సీన్స్ బాగా కామన్ అయిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలో ఎలాంటి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నా లేకపోయినా రొమాంటిక్ సీన్స్..లిప్ లాక్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. అయితే ఇవే సినిమాని నడిపిస్తాయనుకుంటే పొరపాటే. ఇక రీసెంట్‌గా ఒక పాపులర్ సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్‌గా మారీ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరో ఒక్కడైతే హీరోయిన్స్ మాత్రం ఆరుమంది. ఈ ఆరుమంది కాస్తో కూస్తో ఫేం ఉన్న వాళ్ళే. 


వీళ్ళందరితోను హీరోకి లిప్ లాక్ ఉందంటే మరీ ఈ సినిమా కథేంటో సినిమా చూస్తే గానీ అర్థమవదు. అయితే ఆరుమంది హీరోయిన్స్ తో లిప్ లాక్ సీన్స్ నా థాటే అంటున్నారు దర్శకుడు. 'భలే భలే మగాడివోయ్‌', 'నేను లోకల్‌', 'మహానుభావుడు', 'శైలజారెడ్డి అల్లుడు'తో సినిమాటోగ్రాఫర్‌గా నిజార్‌ షఫీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాటోగ్రాఫర్ 'సెవెన్‌' సినిమా ద్వారా దర్శకుడిగా మారారు.


హవీష్‌ హీరోగా రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. ఎంతో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాను ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు ఈ సినిమాలో లిప్‌ కిస్సుల ఐడియా నాదే. అవన్నీ కథలో భాగంగా ఉంటాయి. కానీ ఈ సన్నివేశాలు ప్రేక్షకులను థియోటర్స్ కి రప్పించడానికి మాత్రం పెట్టినవి కాదు అని క్లారిటి ఇచ్చాడు. మరి నిజంగా కథలో అవసరమయ్యో ఈ సీన్స్ పెట్టారా..లేదా ప్రేక్షకులు ఇలాంటి సీన్స్ బాగా ఇష్ఠపడుతున్నారనే పెట్టారా అన్న విషయం సినిమా చూశాక గాని అర్థం కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: