అక్కినేని నాగార్జున నటించిన భారీ బడ్జెట్ సినిమా రక్షకుడు. ఈ సినిమా 1997 లో రిలీజైంది. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మిత సేన్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఆమె తెలుగులో నటించిన మొదటి చివరి సినిమా ఇదే. మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ లో కూడా నటించి మెప్పించి టాప్ హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సుష్మిత జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి తెలిపింది. ముఖ్యంగా సుష్మిత తన 2014 పరిస్థితి గురించి షాకింగ్ విషయాలను తెలపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 


2014వ సంవత్సరంలో సుష్మిత తీవ్ర అనారోగ్యంతో పడింది. ఆమె ఆరోగ్యం కుదుట పడటం అసాధ్యం అంటూ వైద్యులు తేల్చి చెప్పారట. శరీరంలో ఉండే ఒక కీలకమైన అడ్రినల్ గ్రంధి పని చేయక పోవడంతో సుష్మిత సేన్ తరచు కళ్లు తిరిగి పడిపోతూ ఉండేదట. దాంతో ఆమె బతకడం కష్ఠం అనుకున్న సమయంలో తప్పని పరిస్థితుల్లో వైద్యులు స్టెరాయిడ్స్ ఎక్కించాలని నిర్ణయించుకున్నారట. ఎంతో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ ను ప్రతి రోజు ఎనిమిది గంటలకు ఒకసారి చొప్పున ఎక్కిస్తూనే ఉండాలి. 


అలా రెండు సంవత్సరాల పాటు స్టెరాయిండ్స్ ఎక్కించుకోవడం వల్ల సుష్మిత సేన్ ఆరోగ్యం కుదట పడిందట. అయితే స్టెరాయిడ్స్ వాడటం వల్ల విపరీతమైన బరువు పెరగడంతో పాటు అంద విహీనంగా తయారయ్యిందట. దాంతో సుష్మిత రెండేళ్ల పాటు బయట ప్రపంచంకు కనిపించకుండా విదేశాల్లోనే ఉండి పోయింది. విదేశాల నుండి ఈమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి వచ్చిందట. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు అన్న విషయం మాత్రమే అందరికి తెలుసు. 


మరింత సమాచారం తెలుసుకోండి: