కాజల్ ఎప్పుడు లేని విధంగా హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. కాజల్ అగర్వాల్ తన గ్లామర్‌తో ఎంతగా ఆకట్టుకున్నా.. నటిగా మాత్రం ఆమెకు ఎప్పుడూ అంత మంచి పేరు రాలేదు. ‘మగధీర’ లాంటి ఒకట్రెండు సినిమాల్లో కొంచెం ప్రత్యేకత చాటుకుంది. మిగతా వాటిలో చాలా వరకు ఆమెవి గ్లామర్ డాల్ రోల్సే. తాజాగా ‘సీత’ సినిమాలో లీడ్ రోల్‌తో తనేంటో చాటి చెప్పాలని చూసింది. ఆమె పెర్ఫామెన్స్ పర్వాలేదు కానీ.. ఒక సమంత లాగో.. ఒక నయనతార లాగో తనదైన ముద్ర వేయడంలో కాజల్ విఫలమైంది.


ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో కాజల్ పడ్డ కష్టమంతా కూడా వృథానే అయింది. మొత్తానికి నటిగా తనేంటో చాటుకునేందుకు కాజల్ చేసిన ప్రయత్నం పూర్తిగా వృథా అయిపోయింది. ‘సీత’తో ఆమె అనుకున్న లక్ష్యం ఏమీ నెరవేరలేదు.ఐతే ‘సీత’తో ఎలాగూ అటెన్షన్ గ్యాదర్ చేయలేకపోయిన కాజల్ అగర్వాల్.. ఫొటో షూట్లతో రచ్చ లేపాలని చూస్తోంది. సీత రిలీజ్ తర్వాత ఆమె నాలుగైదు ఫొటో షూట్లు చేయడం విశేషం.


ఒకదాంట్లో అసలు మేకప్ లేకుండా అంత ఆకర్షణీయంగా ఏమీ లేని ఒరిజినల్‌ లుక్‌తో ఒక షూట్ చేసిందామె. తాజాగా పింక్ డ్రెస్‌‌లో ఒక ఆఫ్ బీట్ షూట్ చేసింది. ఇంకోటి బ్లాక్ అండ్ ఫొటో షూట్. వీటి మధ్య ఇంకో రెండు షూట్లు అవగొట్టింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటో షూట్లకు సంబంధించిన పిక్సే కనిపిస్తున్నాయి. ‘సీత’ తర్వాత అందరూ తన గురించి తెగ మాట్లాడేసుకుంటారని ఆశించిన నిరాశ పడిన కాజల్.. ఇలా ఫొటో షూట్లతో అయినా రచ్చ లేపుదామని చూస్తున్నట్లుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: