కాస్టింగ్ కౌచ్ అనే ప‌దం గ‌త కొద్ది నెల‌లుగా సినిమా ఇండ‌స్ట్రీల్లో పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపేసింది. ప‌లువురు హీరోయిన్లు ఎంతో మంది చీక‌టి జీవితాల‌ను బ‌య‌ట పెట్టేశారు. సినిమాల్లో ఛాన్సులు కావాలంటే హీరోయిన్ల‌ను, యువ‌తుల‌ను ఎలా వేధిస్తారో సీక్రెట్లు బ‌య‌ట పెట్టారు. ఇక ప‌లువురు సీనియ‌ర్ హీరోయిన్లు సైతం మీ టు ఉద్య‌మంలో పాల్గొని గ‌తంలో కూడా త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను ఓపెన్‌గానే చెప్పారు.


ఇక ఇప్పుడు మ‌ళ్లీ మ‌రో వ‌ర్థ‌మాన హీరోయిన్ త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని బ‌య‌ట పెట్టి ప్ర‌కంప‌న‌లు రేపింది. అయితే ఈ సారి ఆమె టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు కూడా బ‌య‌ట‌కు లాగింది. ఈ ఇష్యూతో విజ‌య్‌కు సంబంధం లేక‌పోయినా ఒక రాత్రి నాతో ప‌డుకుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో ఛాన్స్ ఇస్తాన‌ని ఓ ద‌ర్శ‌కుడు త‌న‌కు ఆఫ‌ర్ చేసిన‌ట్టు ఆరోపణలు చేసింది తమిళ నటి షమ్ము. 


ష‌మ్ము ఆరోప‌ణ‌ల‌తో ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు ? అన్న‌ది ఇప్పుడు హాట్ హాట్‌గా డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. విజయ్ దేవరకొండతో సినిమాలు చేయబోతున్న దర్శకుల లిస్ట్ లో అతడి పేరు కూడా ఉందని చెప్పిన షమ్ము, ఆ పేరును మాత్రం బయటకు వెల్లడించలేదు. ఇక ష‌మ్ము చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే ప్ర‌స్తుతం విజ‌య్ భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో డియ‌ర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు.


ఇక ఈ సినిమా త‌ర్వాత క్రాంతి మాధ‌వ్‌తో క‌మిట్ అయ్యాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. దీంతో పాటు మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై హీరో అనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆమె ఆరోప‌ణ‌ల‌ను బ‌ట్టి చూస్తే ఈ ముగ్గురు ద‌ర్శ‌కుల‌లో ఎవ‌రో ఒక‌రిని ఆమె టార్గెట్ చేసిందా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు మాత్రం చీప్ ప‌బ్లిసిటీ కోస‌మే ఆమె ఇలా చేస్తుంద‌ని ఆరోపిస్తున్నారు. మ‌రి అస‌లు వాస్త‌వాలు ఆ దేవుడికే ఎరుక‌..!



మరింత సమాచారం తెలుసుకోండి: