తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  పోకిరి చిత్రం తర్వాత మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న మహేష్ నటించే ప్రతి సినిమాలో సంథీంగ్ స్పెషల్ అనే విధంగా ఉంటాయి.  శ్రీమంతుడు చిత్రంలో ఊళ్ళను దత్తత తీసుకొని అక్కడి వారి కష్టాలు ఎలా తీర్చాలో అన్న కాన్సెప్ట్ అదిరిపోయింది..తర్వాత వచ్చిన భరత్ అనే నేను రాష్ట్రాభివృద్ది కోసం నిధులు ఎలా వినియోగించుకోవాలి..ప్రజల నమ్మకాన్ని డబ్బు తో కాదు..అభివృద్ది చూపించి గెల్చుకోవాలన్న కాన్సెప్ట్ సూపర్ గా ఉంది..రీసెంట్ గా రిలీజ్ అయింది ‘మహర్షి’. 

ఈ చిత్రాన్ని రైతు సమస్యలపై అద్భుతంగా ఆవిష్కరించారు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని..వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు.

మహర్షి విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేసింది. కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూనే వుంది. ఇక 27 రోజులకి 200 కోట్ల గ్రాస్ ను రాబట్టేసి 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక నైజామ్ ఏరియాలో ఈ చిత్రం మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: