రష్మిక మందన్న... ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కొట్టిన తరువాత గీత గోవిధం చేసింది.  ఈ సినిమా వందకోట్ల రూపాయలను వసూలు చేసి షాకిచ్చింది.  గీతగా చేసిన రష్మిక పాత్రకు మంచి పేరు వచ్చింది.  దేవదాస్ సినిమా బాగుందనే టాక్ వచ్చినా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో సినిమా ఫెయిల్ అయ్యింది.  ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చేస్తున్న ఈ రౌడీ హీరోయిన్... మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరోయిన్ గా బుక్కైంది.  


నాగశౌర్య హీరోగా చేసిన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ తొలిసినిమాతో సక్సెస్ అందుకోవడానికి ఆమె వాయిస్ ఒక కారణం అయ్యింది.  తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగును పలికిన తీరు ఆకట్టుకుంది.  డైలాగుల్లో స్పష్టత... వేరియేషన్ ను ప్రదర్శించింది. వాయిస్ బాగున్నా సెకండ్ సినిమా గీత గోవిందంలో డబ్బింగ్ చెప్పించారు. 


దేవదాస్ లోను డబ్బింగ్ చెప్పించారు.  మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో అయినా ఓన్ వాయిస్ ఉంచుతారో లేదంటే డబ్బింగ్ చెప్పిస్తారో చూడాలి.  ఎవరి పాత్రకు వాళ్ళు ఓన్ వాయిస్ చెప్పుకుంటే బాగుంటుంది కదా.  గతంలో అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో హీరోయిన్లు తెలుగువారే ఉండేవారు.  కాబట్టి వాళ్ళే సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేవారు.  


1980 తరువాత అంతా మారిపోయింది.  సినిమా ఇండస్ట్రీలోకి దిగుమతి ప్రారంభమైంది.  అప్పటి నుంచి డబ్బింగ్ కు ప్రాధాన్యత పెరిగింది.  దిగుమతి హీరోయిన్ల పుణ్యమా అని డబ్బింగ్ ఆర్టిస్టులకు గిరాకి పెరిగింది.  మూడు పాటలు ఆరు డబ్బింగ్ లు అన్నట్టుగా మారింది డబ్బింగ్ ఆర్టిస్టుల వ్యాపారం.  అయితే, ఇప్పుడు హీరోయిన్లు తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పటానికి ఇష్టపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: