మెగాస్టార్ సైరా సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలం అయ్యింది.  ఎప్పుడో షూటింగ్ పూర్తికావాల్సింది.  ఇప్పటి వరకు పూర్తవ్వలేదు.  సమ్మర్లో సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే... దసరాకు సెట్ చేశారు.  ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది.  


కర్ణుడి మరణానికి చాలా కారణాలు ఉన్నట్టు సైరా ఆలస్యానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి.  సినిమా బాగా రావాలనే ఉద్దేశ్యంతో నిదానంగా షూట్ చేస్తున్నారు.  నిదానం అన్నది మరీ నినాదంగా మారింది.  ఒక్కోసారి చేసిన షూట్ నచ్చక రీ షూట్ చేస్తున్నారు.  ఒకరోజు అవ్వాల్సిన పనులు నాలురు రోజులు పడుతున్నాయి.  


నిర్మాత రామ్ చరణ్ మాత్రం ఆలస్యం అయినా పర్వాలేదు సినిమా మాత్రం బాగారావాలి అని చెప్పడంతో.. ఇలా ఆలస్యం అవుతూ వస్తున్నది.  అక్టోబర్ 2 కు ఫైనల్ చేశారు.  అప్పటికైనా సినిమాను తీసుకొస్తారా లేదా అన్నది తెలియడం లేదు.  ఈ సైరా తరువాత చేయాల్సిన లిస్ట్ చాలా ఉన్నది.  


ఒకటి తరువాత ఒకటి త్వరగా ఫినిష్ చేయాలని రామ్ చరణ్ అంటూనే.. సైరా లేట్ చేస్తున్నారు.   దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ కోసం కాచుకొని కూర్చున్నాడు.  ఎప్పుడు సినిమా స్టార్ట్ చేయాలా అని.. ఎట్టకేలకు మోక్షం ప్రసాదించి ఆగష్టు 22 న ప్రారంభోత్సవం చేస్తున్నారు.  కొరటాల తరువాత త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: