కన్నడం నుంచి టాలీవుడ్ కు వచ్చి టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే డీజే సినిమాతో తన ఫేట్ మారిపోయింది.  డీజేలో టు పీస్ బికినీతో పూల్ లో సెగలు లేపిన ఈ బ్యూటీ.. తరువాత వరసగా సినిమాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నది.  ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో అవకాశం దక్కించుకొని విజయం సాధించింది.  


మహర్షిలో చోటు దక్కించుకొని హిట్ కొట్టింది.  ఇప్పుడు బాహుబలి స్టార్ ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తోంది.  అక్కడితో ఆగకుండా.. తనకు డీజే సినిమాతో లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నది.  త్రివిక్రమ్ దర్శకుడు.  ఈ సినిమాతో పాటు ఈ అమ్మడి ఖాతాలో మరో కొన్ని సినిమాలు ఉన్నాయి. 


అటు బాలీవుడ్ లోను వరసగా అవకాశలు దక్కించుకుంటోంది.  హౌస్ ఫుల్ 4 లో నటించింది.  ఇన్ని వరసగా చేస్తూ...అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పరుగులు తీస్తున్న పూజకు కాస్త టైమ్  దొరికిందనుకుంటా.. వెంటనే పూల్ లోకి దిగేసి ఎంచక్కా ఈత కొట్టేస్తోంది.  


కాసేపు జలకాలాడి.. రిలాక్స్ రిలాక్స్ అవుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  అసలే పసిడి అందం... పైగా బికినీ... ఇంకేముంది యూత్ లైక్ మీద లైక్ లు కొడుతూ షేర్ చేస్తున్నారు. యూత్ హాట్ హీరోయిన్ లిస్ట్ లో ఈ ఫోటోను పెట్టేసుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: