ఇండస్ట్రీలో రాజకీయాలలో రూమర్లు రాకుండా ఒక్కరోజు కూడా గడవదు. అయితే నిప్పు లేకుండా పొగరాదు అంటారు కాబట్టి ఇలాంటి రూమర్లకు ఎంతోకొంత ప్రాధాన్యత కనిపిస్తుంది. దీనితో ఇలాంటి రూమర్లు వైరల్ గా మారి అందరికీ ఆశక్తిని కలిగిస్తూ ఉంటాయి.

ఇప్పుడు ఇలాంటి సందర్భమే ఒక టాప్ హీరోయిన్ విషయంలో ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఆ వార్తల ప్రకారం ఆమె ఒక టాప్ హీరోయిన్ అని అంటున్నారు. గత సంవత్సరం విడుదలైన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో ఆమె నటనకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. 

అయితే ఆమెకు ఎంతో క్రేజ్ ఉన్నా వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకోకుండా కేవలం మంచి పాత్రలు ఉంటేనే నటిస్తాను అని చెపుతూ ఎక్స్ పోజింగ్ సీన్స్ కు తాను దూరం అన్న స్పష్టమైన సంకేతాలు ఆ టాప్ హీరోయిన్ తన దర్శక నిర్మాతలకు ముందుగానే ఇస్తుంది అంటారు. అలాంటి టాప్ హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఒక నిర్మాత వల్ల మాటల మాయలో మోసపోయింది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

హడావిడి చేస్తున్న ఈ గాసిప్పుల ప్రకారం ప్రస్తుతం ఆ టాప్ హీరోయిన్ నటిస్తున్న ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అతిథి పాత్రలో నటిస్తాడు అని చెప్పి ఆమెను ఆ మూవీ దర్శక నిర్మాతలు ఒప్పించినట్లు టాక్. ఆసినిమా షూటింగ్ సుమారు 80 శాతం పూర్తి అయిపోయినా ఎక్కడా జూనియర్ ప్రస్తావన రాకపోవడంతో ఆమె అసహనానికి గురై ఆమె ఆమూవీ షూటింగ్ ను పూర్తి చేయకుండా ప్రస్తుతం నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్నట్లు టాక్. దీనితో షాక్ అయిన ఆమూవీ దర్శక నిర్మాతలు ఆమెతో రాయబారాలు చేస్తూ భవిష్యత్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత తాము జూనియర్ తో తీయబోయే సినిమాలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తామని చెపుతూ ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: