ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి దాదాపు అందరు సెట్ అయ్యారు. రామ్ చరణ్ కు జోడి కుదిరింది.  కాకాపోతే ఎన్టీఆర్ కు సెట్ అయ్యినట్టు అయ్యి మిస్ అయ్యింది.  కథ ప్రకారం హాలీవుడ్ నటి ఉండాలి.  దానికోసం డైసీ ఎడ్గర్ ను ఎంపిక చేశారు.  అయితే, కొన్ని కారణాల వలన డైసీ సినిమా నుంచి తప్పుకుంది.  దీంతో చేసేది లేక రాజమౌళి మరో హీరోయిన్ కోసం గాలింపు మొదలుపెట్టారు.  


ఎవరు సెట్ అవుతారు అన్నది ఇంకా తెలియడం లేదు.  కథ ప్రకారం విదేశీ అమ్మాయి కావాలి.  రాజమౌళి ఈ విషయంలో అస్సలు రాజీపడదు అనే సంగతి తెలిసిందే.  ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట తానే వినడు అనే సామెత ఉంది కదా అలా అన్నమాట. డైసీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదు.  


రామ్ చరణ్ కు అలియా భట్ ఏంటి.. ఎన్టీఆర్ కు డైసీ ఏంటి అని కొంతమంది బహిరంగంగా విమర్శించారు కూడా.  రాజమౌళి ఇవేమి పట్టించుకోలేదు.  ఒకవైపు షూట్ చేస్తూనే.. మరోవైపు డైసీ స్థానంలో కావాల్సిన హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నాడు.  రాజమౌళి మనసులో ఎవరున్నారు అనే విషయం ఆయనకు తప్పా ఎవరికీ తెలియదు.  


ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో వస్తున్న క్యూరియాసిటీ మాలులుగా లేదు.  ఎప్పుడు లేని విధంగా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఎలాంటి హీరోయిన్ దొరుకుతుంది.  ఎలాంటి ముద్దుగుమ్మను తీసుకొస్తున్నారు అని కళ్ళు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు.  ఈ ఎదురు చూపులు ఇంకెంతకాలం ఉండాలో అర్ధం కావడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: