ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా నటీ,నటుల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు.  ఇప్పటికే మెగా, నందమూరి,అక్కినేని, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీ హీరోలు తమ సత్తా చాటుతున్న సమయంలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్, జీవితల కూతురు  శివాత్మిక ‘దొరసాని’చిత్రంతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అవుతుంది.


ఇక అర్జున్ రెడ్డి తో యూత్ లో సన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు.  తాజాగా‘దొరసాని’ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది.  . ఈ చిత్రం దొరల గడీల నేపథ్యంలో సాగుతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

"వీనికేం తెల్వదు పీకదు... దొరసానులెప్పుడైనా బయటకు వత్తార్రా?", "నేను చిన్న దొరసాన్ని ప్రేమిస్తానురా... అంటే దొరసాని కూడా నన్ను చూత్తాంది", "మీరు దొరసాని... కాదు దేవకి... కాదు మీరు నా దొరసాని" అంటూ హీరో కొట్టే డైలాగ్స్ బాగా ఆకర్షిస్తున్నాయి.  మరీ ఈ చిత్రంతో ఇద్దరు వారసులు ఎంత వరకు హిట్ అందుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: