రామానాయుడు తెలుగు సినీ జగత్తులో మేరు పర్వతం లాంటి వారు. ఆయన శతాధిక చిత్ర నిర్మాత. గిన్నీస్ బుక్ అవార్డ్ గ్రహీత. నాటి బ్లాక్ అండ్ వైట్ నుంచి నేటి కలర్ సినిమాల వరకూ అర్ధ శతాబ్దం పైగా ఆయన సినీ ప్రస్తానం విజయవంతంగా నడిచింది. నందమూరి, అక్కినేని క్రిష్ణ శోభన్ తరం నుంచి ఈనాటి తరం వరకూ ఆయన సినిమాలు తీసి అందరివాడు అయ్యారు.


ఈ రోజు ఆయన జయంతి. 1936 జూన్ 6న  ప్రకాశం జిల్లా కారంచేడులో పుట్టిన రామానాయుడు తెలుగు సినిమాకు ప్రేమనగర్ కట్టాడు. అందులో ఆయనే సోగ్గాడుగా అవతరించి ముందడుగు వేశారు. రామానాయుడు సినిమాల్లో ఆయనే హీరో. ఆయనే దర్శకుడు. తెర ముందు ఎవరున్నా సినిమాను మొత్తం డిజైన్ చేసేది ఆయనే. ఆయనకు మొత్తం 23 క్రాఫ్టుల మీద మంచి పట్టు ఉంది.


ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత. ఏ సీజన్ కి ఏ మూవీ వస్తే హిట్ కొడుతుందే బాగా తెలిసిన వారు.  ఇక బౌండ్ బుక్ ఉంటేనే తప్ప మూవీని స్టార్ట్ చేయని నిబద్ధత ఆయనకె సొంతం. మంచి సాహిత్యం, సంగీతం, పాత్రలకు తగ్గ క్యాస్టింగ్ సెలెక్షన్ ఇవే రామానాయుడు విజయరహస్యాలు. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపించాలన్నది ఆయన తపన. .


రామానాయుడు ఎంతో సినిమాకు చేశారు. ఎన్నో సాధించారు. అవార్డులు ఆయన్ని వరించి వచ్చాయి. అయితే ఆయనకు తీరని కోరిక ఒకటి ఉంది. అదే దర్శకుడుగా మెగా ఫోన్ పట్టాలని, ఎప్పటికపుడు వాయిదా వేస్తూ వచ్చారు. చివర్లో ఆరోగ్యం సహకరించలేదు. దాంతో ఎందరికో తన బ్యానర్లో అవకాశం కల్పించిన ప్రముఖ నిర్మాత తనకు మాత్రం డైరెక్టర్ చాన్స్ ఇచ్చుకోకుండానే కన్నుమూశారు. అదే ఆయన జీవితంలో విషాదంగా  మిగిలింది అంటారు. ఏది ఏమైనా రామానాయుడు లెజెండరీ పర్సనాలిటీ.



మరింత సమాచారం తెలుసుకోండి: