సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా మహర్షి ఇప్పటికే అయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాక, కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్దలుకొట్టి ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. నిజానికి ఈ సినిమాకు ఎంత నెగటివ్ టాక్ ప్రచారం చేసినప్పటికీ, ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పటికి ఆదరిస్తారు అనడానికి తమ హీరో సినిమానే నిదర్శనమని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు. అలానే ఎంతమంది ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినా ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి కారణం కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు చరిష్మానే అని మహర్షి టీమ్ అంటోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ గ్రాస్ కలెక్షన్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. 

అంతేకాదు మహేష్ బాబు అడ్డా అయిన నైజామ్ లో ఈ సినిమా ఇప్పటికే రూ.30 కోట్ల షేర్ రాబట్టి, ఇప్పటికీ కాస్త స్టడీగానే ముందుకు సాగుతోందని, అలానే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఈ సినిమాకు కలెక్షన్లు వీక్ ఎండ్స్ లో బాగా ఉంటున్నాయి అంటున్నారు. అయితే నిన్న రంజాన్ పండుగ కావడం, అలానే మరొక రెండు రోజుల్లో వీక్ ఎండ్ రాబోతుండడంతో ఈ వీక్ కూడా మహర్షి బాగానే రాబట్టే అవకాశాలు ఉన్నాయని, ఇకపోతే ఈ వారం విడుదలయ్యే సినిమాల పరిస్థితిని బట్టిగాని రాబోయే వారం మహర్షి సినిమా కలెక్షన్లు చెప్పలేమని కూడా అంటున్నారు. ఇక ఇటీవల విడుదలైన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రేక్షకుల మొదటి ఛాయస్ గా మహర్షి నిలుస్తోందని, 

కాబట్టే ఇప్పటికీ ఇంత బాగా కలెక్షన్లు వస్తున్నాయని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. ఇక కొంతమంది మాత్రం ఈ సినిమా ఓవర్సీస్, సీడెడ్ ఏరియాల్లో సరిగా రాబట్టలేకపోతోందని చెపుతున్నప్పటికీ, ఆ రెండు ప్రాంతాల్లో కూడా బయ్యర్లు పెట్టిన పెట్టుబడి చాలావరకు వచ్చేసిందని, ఇంకొద్దిరోజులు గడిచిన దానినిబట్టి అక్కడ ఎంత వసూలు చేస్తుందో తెలుస్తుందని అంటున్నారు. ఇక ఓవర్ ఆల్ గా చూస్తే మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో మొదలైన మహర్షి పయనం, హిట్, సూపర్ హిట్ దాటి, ఎపిక్ బ్లాక్ బస్టర్ దాకా సాగడం చాలా ఆనందంగా ఉంది అంటూ మహేష్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికల్లో సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: