కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.  అందులో ఎలాంటి సందేహం లేదు.  లక్ష్మి కళ్యాణం సినిమా నుంచి ఇప్పటి వరకు అనేక సినిమాలు చేసింది.  ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.  మగధీర, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసింది.  


ఇదిలా ఉంటె, గత కొన్ని రోజులుగా కాజల్ కు పెద్దగా అవకాశలు రావడం లేదు.  చేసిన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి.  దీంతో ఈ అమ్మడు ఇబ్బందులు పడుతున్నది. ఇబ్బందులనుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.  కాజల్ ఇప్పుడు ఏం చేయబోతున్నది. సినిమాల్లోనే ఉంటూ వచ్చిన అవకాశలు చేస్తుందా.. లేదంటే వ్యాపారం బిజీ అవుతుందా లేదు అంటే పెళ్ళికి సిద్ధం అవుతుందా?


కాజల్ సినిమాల్లో సంపాదించిన డబ్బును ఇప్పటికే వ్యాపారంలో పెట్టిన సంగతి తెలిసిందే.  కాజల్ సోదరి నిషా అగర్వాల్ అక్క కాజల్ కు సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటోంది.  ఒకవేళ కాజల్ సినిమాల నుంచి తప్పకుంటే నిషాతో పాటు కాజల్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుంది.  గోల్డ్, రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్న కాజల్ మరిన్ని వ్యాపారాలు ప్రారంభించే అవకాశం లేకపోలేదు. 
బిజినెస్ చేస్తూనే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధం అవుతుందనే వార్తలు అందుతున్నాయి.  పెళ్ళికి సిద్ధమైతే.. కాజల్ ఎవరిని వివాహం చేసుకుంటుంది.  సినిమాలో ఉండే వ్యక్తిని వివాహం చేసుకుంటుందా లేదంటే బిసినెస్ మెన్ ను వివాహం చేసుకుంటుందా అన్నది తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: