టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు దేవిశ్రీ ప్రసాద్.  దేవి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ యువ టాలెంటెడ్ సంగీత దర్శకుడు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ.  అంతేకాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా.  


ఈ బ్యాచులర్ మ్యూజిక్ డైరెక్టర్ పై ఇప్పుడు అనేక రూమర్స్ వస్తున్నాయి. దేవిశ్రీ తెలుగు హీరోయిన్ పొన్నాడ పూజితతో లవ్ లో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.  రంగస్థలం సినిమాలో అది పినిశెట్టికి జోడిగా చేసింది పొన్నాడ.  వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, 7 సినిమాల్లో నటించింది.  


 దేవిశ్రీ తో వస్తున్న  రూమర్లను పూజిత కొట్టి పారేశింది. ‘రంగస్థలం’ 100 రోజుల వేడుక ముందు వరకు తాను అసలు దేవిని ఒక్కసారి కూడా కలవలేదని ఆమె స్పష్టం చేసింది. ‘‘నాకు దేవిశ్రీ సర్‌తో పెళ్లైందని రూమర్లు చూసి చాలా ఆశ్చర్యపోయా. అసలు ఇలాంటివి ఎవరు సృష్టిస్తారో తెలీదు కానీ ఏకంగా ఫొటోలే మార్ఫ్‌ చేసి పెట్టేస్తున్నారు. 


‘రంగస్థలం’ సినిమా 100 డేస్‌ ఫంక్షన్‌లో దేవిశ్రీ సర్‌తో తొలిసారి మాట్లాడాను. అప్పటివరకు ఆయన నన్ను చూడలేదు కూడా. మా ఇద్దరి గురించి ఇలాంటి రూమర్స్‌ వచ్చి అప్పటికే ఆరు నెలలు అవుతోంది. అసలు మనం కలవని, మాట్లాడని ఓ వ్యక్తితో పెళ్లెలా అవుతుంది అంటూ ప్రశ్నలు సంధించింది.  ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: