స‌ల్మాన్‌ఖాన్ అంటేనే మాస్ హీరో. ఎట్‌ప్రెజెంట్  స‌ల్మాన్‌ బాలీవుడ్ మాస్ మూవీల‌కు లీడ‌ర్‌గా మారాడు. స‌ల్మాన్ ష‌ర్ట్ మ‌డ‌త‌పెట్టినా, వంద మంది విల‌న్లను చొక్కా కాల‌ర్‌తో దుమ్ముదులిపినా బాలీవుడ్ జ‌నాలు క్లాప్స్ కొట్టేస్తారు. బాలీవుడ్‌లో స‌ల్మాన్‌కు అంత‌టి మాస్ స్టార్‌డం క్రియోట్ అయింది. ఒక‌ప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా క‌నిపించే ఈ మాస్ ఫార్ములా, ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ అయింది. దీన్ని బాలీవుడ్‌కి ప‌రిచయం చేసిన హీరో స‌ల్మాన్‌ఖానే. ‘వాంటెడ్’, ‘రెడీ’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’, ‘దబాంగ్ 2′, ‘ఏక్ థా టైగర్’ లాంటి మాస్ ఫిల్మ్స్‌తో మిగ‌తా హీరోల‌కు రోల్‌మోడ‌ల్ అయ్యాడు.

ప్రస్తుతం స‌ల్మాన్‌కి ఆ మాస్ మూవీలంటే బోర్ కొడుతుంద‌ట‌. ‘ ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు ఎడాపెడా వచ్చేస్తున్నాయి. ఒకే రకమైన విషయాలతో పదే పదే సినిమాలు తీసేస్తున్నారు. దీనివల్ల సృజనాత్మకత తగ్గిపోతుంది అలాగే జనాలకు విసుగొస్తుంది. ఇలాంటి మాస్ మసాల సినిమాకు త్వరలోనే కాలం చెల్లిపోతుందని’ స‌ల్లూభాయ్ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. స‌ల్మాన్ చెప్పిన స్టేట్‌మెంట్ కార‌ణంగా త‌రువాత రాబోతున్న మాస్ మూవీల క‌లెక్షన్స్‌పై, ఈ ఎఫెక్ట్ ఉంటుంద‌ని బిటౌన్ బాక్సాపీస్ అంటుంది. దీంతో స‌ల్మాన్ త్వర‌లోనే మాస్ చిత్రాల‌కు గుడ్ బై  చెప్సేస్తున్నాడ‌ని అంద‌రూ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: