నితిన్ అసలే హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నాడు.  మంచి కథ దొరికినా ఏవేవో కారణాల వలన సినిమా ఫెయిల్ అవుతున్నది.  ఒక మంచి హిట్ కోసం ఈ హీరో విపరీతంగా ట్రై చేస్తున్నాడు.  చంద్ర శేఖర్ ఏలేటి తో సినిమా కన్ఫర్మ్ అయ్యింది. సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా వింక్ గర్ల్ ప్రియా  ప్రకాష్ వారియర్ ను తీసుకున్నారని తెలుస్తోంది.  


కన్నుకొట్టి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యిన ప్రియా ప్రకాష్...  ఓరు ఆధార్ లవ్ అనే సినిమా చేసింది.  ఈ సినిమా తెలుగులో లవర్స్ డే గా వచ్చింది.   ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ ప్లాప్ అయ్యింది.  ఇలా ప్లాప్ కావడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.  కోటి రూపాయల పారితోషికం నుంచి 20 లక్షలకు పడిపోయింది.  


సినిమా హిట్టయ్యి ఉంటె వేరే తీరుగా ఉండేది.  ప్రియా ప్రకాష్ తో నితిన్ సినిమా అంటే ఎలా ఉంటుందో అని అందరు ఎదురు చూస్తున్నారు.  చంద్రశేఖర్ ఏలేటి మంచి సినిమాలు చేస్తాడనే పేరుంది.  అంత తొందరగా సినిమాను ఒకే చెయ్యడు.  ప్రియాను ఎంచుకున్నాడు అంటే దానిలో ఎదో అర్ధం ఉండే ఉంటుంది.  


ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతోంది.  మరి ఈ సినిమాతోనైనా ఇటు నితిన్ అటు ప్రియా ప్రకాష్ లు హిట్ కొడతారా ఏమో చూడాలి.  హిట్టయితే ఇద్దరు లైన్లోకి వస్తారు లేదంటే లైమ్ లైట్ లోకి వెళ్లడమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: