సమంత టాలెంటెడ్ హీరోయిన్. ఏం మాయ చేసావే సినిమాతో అది నిజమైంది.  ఇప్పుడు ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సింది ఏమి లేదు.  మంచి కథ, కథనాలు ఉంటె తానేంటో చూపిస్తుంది.  ప్రస్తుతం ఓ బేబీ సినిమా చేస్తోంది.  ఈ సినిమా జులై 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  


కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్.  ఇందులో సమంత 70 ఏళ్ల ముసలావిడగా, 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించాలి.  తీరా చూస్తే సమంత 20 ఏళ్ల అమ్మాయిలా మాత్రమే కనిపించింది.  70 ఏళ్ల ముసలావిడగా లక్ష్మి చేసింది.  అదేంటి అలా ఎలా జరిగింది అనే డౌట్ వచ్చింది కదా.. 


మొదట లక్ష్మి పాత్రకు కూడా సమంతనే అనుకున్నారు.  కథ ప్రకారం సమంతనే చేయాలి.  సినిమాకు ముందు దానికి సంబంధించిన గెటప్ ను సెట్ చేశారు.  మేకప్ వేసిన తరువాత అది సమంతకు సెట్ కాలేదు.  దీంతో ఆ పాత్ర కోసం లక్ష్మిని తీసుకున్నారు.  


70 ఏళ్ల లక్ష్మి సడెన్ గా 20 సంవత్సరాల యువతిగా మారిపోయి చేసిన హంగామానే ఓ బేబీ.  పక్కా ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.  ఇప్పటికే రిలీజైన టీజర్ అదరహో అనిపించింది.  నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: