ప్రియాంక చోప్రా ఏరికోరి అమెరికన్ పాప్ సింగర్ ను వివాహం చేసుకుంది.  నిక్ జోనస్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది.  అయినా ఇద్దరు ప్రేమించుకున్నారు.  వివాహం చేసుకున్నారు.  పెద్ద అమ్మాయిని వివాహం చేసుకోవడంతో కొంతమంది నుంచి కొన్ని రకాల మాటలు వినాల్సి వచ్చిందట.  


పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు పడతావని హెచ్చరించారట.  నిక్ అవేమి పట్టించుకోలేదట.  కానీ, వాళ్ళ మాటల వలన నిక్ కొంచం ఇబ్బందిగా ఫీలయ్యాడని ప్రియాంక చోప్రా అంటోంది.  కొన్నాళ్ళు బాగానే ఉన్నామని, ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయని అంటోంది.  


గొడవలు చిన్నవే కాబట్టి ఇద్దరు సర్దుకుపోతున్నారు.  ఒకసారి ఒకరు సర్దుకుపోతే , మరోసారి మరొకరు సర్దుకు పోతున్నారు.  ఇప్పుడు చిన్నవే కావొచ్చు.. ఫ్యూచర్ లో ఇవే గొడవలు పెద్దవైతే పరిస్థితి ఏంటి...ఏమౌతుందో తెలిసిందే.  


సంసారం అన్నాక గొడవలు వస్తాయి.  వచ్చిన వాటిని జాగ్రత్తగా సర్దుకు పోవాలి.  సెలెబ్రిటీలు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి.  ఎందుకంటే వాళ్ళ లైఫ్ పబ్లిక్ కు ముడిపడి ఉంటుంది.  మరి వీరి సంసారం ముందుముందు ఎలా ఉంటుందో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: