సినిమా పరిశ్రమలోకి ఒకసారి ప్రవేశించిన తరువాత హీరోలు అయినా హీరోయిన్లు అయినా మంచి సినిమాలు రావాలని, ఆ విధంగా మంచి సక్సెస్ లతో ముందుకు సాగాలని కోరుకుంటారు. ఆపై కాలం గడుస్తున్నకొద్దీ తమ రూపురేఖల్లో వస్తున్న మార్పులని ఎప్పటికపుడు సరిచేసుకుంటూ వన్నెతరుగని గ్లామర్ తో సినిమాలు చేస్తూ ఉంటారు అనే చెప్పాలి. ఇక ఈ విషయంలో హీరోయిన్లు అయితే మరింత జాగ్రత్త వహిస్తూ ఎప్పటికపుడు రకరకాల సౌందర్య సాధనాలతో తమ అందాన్ని మరింత మెరుగుపరుస్తూ ఉంటారు. ఇక వారి వారి అభిమానులు కూడా ఆ హీరోయిన్ల అందచందాలపై ఉప్పొంగిపోతుండడం చూస్తుంటాం. అయితే ఏ హీరోయిన్ అయినా మేకప్ వేయక ముందు కాస్త సహజంగా, మేకప్ వేసిన తరువాత కొంత అందంగా కనపడడం జరుగుతుంది. 

ఇక అందులో ఎక్కువ మంది హీరోయిన్లు మేకప్ లేకుండా బయటకు రారని చెప్పాలి. ఎందుకంటే తమ సహజ సిద్దమైన గ్లామర్ ని చూసిన ప్రేక్షకులు, రేపు సినిమా థియేటర్ కి వచ్చిన తరువాత ఫలానా హీరోయిన్ సినిమాలో ఎంతో అందంగా ఉంది, కానీ బయట మాత్రం సాధాసీదాగానే ఉంది అని అనుకుంటారేమో అనే భయం ఎక్కువమందిలో ఉంటుందనేది సినీ విశ్లేషకులు చెప్తున్నమాట. అటువంటిది ఇటీవల ఒక స్టార్ హీరోయిన్ మేకప్ లేకుండా తన సహజ సిద్దమైన మొహాన్ని ఫోటోలు తీసి ఏకంగా సోషల్ మీడియా వేదికల్లో పెట్టి పెద్ద సంచలనానికి తెరతీసింది. ఆమె ఎవరో కూడా మన అందరికి తెలుసు. ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కాజల్. ఇకపోతే ఇటీవల తన మేకప్ వేయని మొహాన్ని ఫోటోలు తీసి తన సోషల్ మీడియా వేదికల్లో పెట్టిన కాజల్ దానిపై స్పందిస్తూ, ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజంలో ఫిజికల్ అట్రాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం. ఇక మన అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఎన్నో రకాల సౌందర్య సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటితో మనం మనల్ని మరింత అందంగా మలుచుకోవచ్చు. 

కానీ ఎంత కృత్రిమంగా తయారైనా ఒకరి సహజ సిద్ధమైన అందాన్ని ఇష్టపడితే కలిగే ఆ ఆనందమే వేరని ఆమె పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె పోస్ట్ పై ఇప్పటికీ సోషల్ మీడియా వేదికల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ లో ఉన్న కాజల్ ఇటువంటి నాచురల్ పిక్స్ పోస్ట్ చేయడానికి ఎంతో గట్స్ కావాలి, కానీ ఆమె ఏ మాత్రం సంకోచించకుండా తన మేకప్ లేని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కేవలం రీల్ మీదనే కాదు, రియల్ గా కూడా తానొక గొప్ప స్టార్ ని అని నిరూపించుకుంది అంటూ ఆమెపై గత కొద్దిరోజులుగా పలువురు అభినందనలు కురిపిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక అంతేకాక ఈ తాజా ఘటనతో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో కాజలే నెంబర్ వన్ హీరోయిన్ అని ఆమె పెట్టిన ఫోటోలకు వస్తున్న స్పందన బట్టి చూస్తే అర్ధం అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: