జూనియర్ ఎన్టీయార్ ఇప్పుడు టీడీపీ పార్టీలోకి రావాలి. తాత పార్టీని ఈ సమయంలో ఆదుకోవాల్సిన అవసరం తారక్ కు ఉంది.తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐనా తారక్ రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

కానీ తారక్ అభిమానుల ఆలోచన మాత్రం మరో విధంగా ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ జూనియర్ ఎన్టీయార్ ను రాజకీయ అవసరాల కోసం వాడుకుని దూరం చేసిందని ఇప్పుడు జూనియర్ పార్టీలో చేరినా మరలా మోసం చేయరని నమ్మకం ఏముందని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు సినిమాల్లో ఎన్టీయార్ మంచి స్థాయిలో ఉన్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హిట్లు అందిస్తున్నాడు. ఇలాంటి సమయంలో రాజకీయాల్లొకి అడుగుపెట్టి తప్పు చేయొద్దని అభిమానులు సూచిస్తున్నారు. మరి జూనియర్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాకపోయిన 2024 ఎలక్షన్ల సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: