ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాభవంతో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ తో మూవీని చేసి ఆ పరాభవం నుండి బయటపడతారు అని అనుకున్నారు అంతా. అయితే అనుకోకుండా ఈమూవీ ప్రాజెక్ట్ వెనక్కు వెళ్ళి దర్శకుడు కె.ఎస్. రవికుమార్ మూవీ ముందుకు రావడంతో బాలకృష్ణ బోయపాటిల మూవీ ప్రాజెక్ట్ ఇక అటకెక్కింది అని భావించారు. 

దీనితో బోయపాటి కూడ వేరే హీరోతో మరొక సినిమాను తీయడానికి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే అనూహ్యంగా బోయపాటి బాలకృష్ణల మూవీ ప్రాజెక్ట్ కు ఇప్పుడు దిల్ రాజ్ ఊతం లభించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఎప్పటి నుంచో బాలకృష్ణతో సినిమా తీయాలి అని కోరుకుంటున్న దిల్ రాజ్ దృష్టి బోయపాటి బాలయ్య కోసం చెప్పిన కథ పై పడటంతో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కింది అని అంటున్నారు. ఇప్పటికే ఈమూవీ ప్రాజెక్ట్ ను దిల్ రాజ్ నిర్మాణ సంస్థలో నిర్మించడానికి ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం. 

అయితే ఈ విషయమై దిల్ రాజ్ బోయపాటికి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు టాక్. ఈమూవీని ఎట్టి పరిస్థితులలోను 45 కోట్లలోపు పూర్తి చేయాలని దిల్ రాజ్ బోయపాటికి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణకు ఉన్న మార్కెట్ రీత్యా 45 కోట్లు మించి ఖర్చు చేస్తే నష్టాలు వస్తాయని దిల్ రాజ్ అభిప్రాయం అని అంటున్నారు. దీనితో అత్యంత భారీ సినిమాలు తీసే బోయపాటి ఒక మెట్టు దిగి దిల్ రాజ్ చెప్పిన విధంగా బడ్జెట్ తగ్గించి బాలయ్యతో సినిమా తీయగలడా ? లేదా అన్న విషయం మరి కొద్దిరోజులలో తేలిపోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: