బాలయ్య 105 చిత్రంపై డౌట్లు ముసురుకున్నాయి. అసలు ఆ మూవీ ఉంటుందా ఉండదా అన్న  చర్చ కూడా జరిగింది. ఎందుకంటే వర్తమాన రాష్ర రాజకీయ పరిస్థితులను తీసుకుని ఆ కధను డిజైన్ చేశారట. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం  సీన్ మారడంతో స్క్రిప్ట్ మళ్ళీ మొదటికి వచ్చిందని తెలుస్తోంది.


నిజానికి గత నెల 17న ప్రారంభం  కావల్సిన ఈ మూవీ ఆగిపోవడానికి స్రిప్ట్ వర్క్ కుదరకనేనని అంటున్నారు. ఇక ఈ మూవీకి ఇపుడు మార్పులు చేర్పులు భారీగా చేశారట. మొత్తానికి కధ కుదరడంతో సెట్స్ మీదకు తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయని అంటున్నారు. 


ఈ మూవీ ఈ నెల 12న మొదలౌవుతుందంతి తెలుస్తోంది. శరవేగంగా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. దీన్ని బాలయ్యతో జై సిమ్హ మూవీ తీసి హిట్ కొట్టిన కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: