టాలీవుడ్ అంటేనే అదో మాయాలోకం. అక్కడ ఎవరు ఎపుడు హిట్ అవుతారో, మరెపుడు ఫట్ అవుతారో ఆ దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. ఇక మంచి ఫాం లో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే తెలివైన వాళ్లతో పాటు, జరిగింది జరగనీ అనుకునే వారు కూడా ఇక్కడ కనిపిస్తారు. మొత్తానికి లక్ ని, విధిని బాగా నమ్ముతారు.


ఇపుడు టాలీవుడ్లో లక్కుని, అన్నను  నమ్ముకుని తమ్ముళ్ళు అరంగేట్రం చేస్తున్నారు. వారిలో ఫస్ట్ ప్లేస్ గా చెప్పుకోవాలి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ కుర్రాడు దొరసాని సినిమాలో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆనంద్ పక్కన దొరసానిగా హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక పరిచయం అవుతోంది. ఇదే వరసలో మరో హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఉప్పెన పేరు మీద తీస్తున్న మూవీలో వైష్ణవ్ జాలారి పాత్రలో టఫ్ రోల్ ప్లే చేస్తున్నాడు.


ఇదిలా ఉండగా ప్రముఖ నిర్మాత బెల్లంగొండ ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ శ్రీనివాస్ హీరో అయ్యాడు. ఇపుడు ఆయన తమ్ముడు బెల్లంగొండ గణేష్ కూడా హీరోగా తెర ముందుకు వస్తున్నాడు. ఇదే వరసలో హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా వచ్చేశాదు. మరి ముందు ముందు ఎంతమంది తమ్ముళ్ళు టాలీవుడ్లో సందడి చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: