పవన్ ‘జనసేన’ ప్రారంభించినప్పుడు అతడి ఆశయాలను వివరిస్తూ ఏదైనా ఒక మంచి సామాజిక అంశాలతో ఉన్న సినిమాలో నటిస్తే బాగుంటుంది అన్న సూచనలు వచ్చాయి. అయితే ఆవిషయాలను పట్టించుకోకుండా ‘అజ్ఞాతవాసి’ లాంటి రొటీన్ సినిమాలో నటించి పవన్ తన సినిమా కెరియర్ కు తాత్కాలిక విరామం ప్రకటించుకున్నాడు. 

అయితే ఎన్నికలలో పవన్ ఓటమి తరువాత అతడి అభిమానులు అంతా పవన్ నటించిన సినిమా గురించి ఎదురు చూస్తుంటే ఎవరూ ఊహించని విధంగా తమిళ దర్శకుడు వి. సముద్ర పవన్ కళ్యాణ్ ఆశయాల పై ఇప్పుడు సినిమాను ప్రకటించడం అత్యంత ఆశ్చర్య కరంగా మారింది. ఈమూవీకి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ ను నిన్న విడుదల చేసారు.

‘జైసేన’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈమూవీలో శ్రీకాంత్ సునీల్ తో పాటు మరో నలుగురు యంగ్ హీరోలు నటించబోతున్నట్లు సమాచారం. ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీలో పృధ్వీ ఒక ప్రత్యేక పాత్ర చేయడంతో సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్న క్లారిటీ ఇస్తున్నాడు. 

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ తాను ‘జనసేన’ సిద్ధాంతాలకు ప్రభావితం అయి ఈసినిమాను తీస్తున్నట్లు ప్రకటించడం మరింత షాకింగ్ గా మారింది. అయితే ఈ ప్రయత్నాలు అన్నీ గత సంవత్సరం ఎన్నికల ముందు జరిగి ఉంటే పవన్ కు కలిసి వచ్చేది. ఇప్పుడు ఒక్క మున్సిపల్ ఎన్నికలు తప్ప మరే ఎన్నికలు 2024 లోపు లేని నేపధ్యంలో ఈ ప్రయత్నం పవన్ కు ఎంత వరకు ఉపయోగ పడుతుంది అన్నది సందేహమే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: