శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నది.  ఇప్పుడు ఈ అమ్మడి చూపులు టాలీవుడ్ పై ఉన్నది. టాలీవుడ్ లో రెమ్యునరేష కొంత తక్కువే అయినా.. టాప్ హీరోయిన్ గా ఎదిగితే... కావాల్సినంత సంపాదన వస్తుంది.  బిజీగా మారిపోవచ్చు.  అటు బాలీవుడ్ సినిమాలు కూడా చెయ్యొచ్చు.  


ఈ ప్లాన్ తోనే సాహో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది.  గ్రాండ్ ఎంట్రీ సూపర్బ్ గా ఉంటె.. శ్రద్దా కపూర్ కు టాలీవుడ్ లో భారీ అవకాశాలు వస్తాయి.  ఎంత మంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినా ఇంకా కొరతగానే ఉంటుంది టాలీవుడ్ లో.  కాబట్టి ఈ అమ్మడి ఎంట్రీ కోసం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. 


శ్రద్దా కపూర్ టాలీవుడ్ లో మొదటి ఎంట్రీతో హిట్ కొడితే.. టాప్ హీరోల చూపులు ఆమె వైపే ఉంటాయి అనడంలో సందేహం లేదు.  డీజే తరువాత పూజా హెగ్డే కు ఎలాంటి అవకాశం వచ్చిందో తెలిసిందే.  ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సినిమాలు చేస్తోంది.  అలానే ఛలో, గీత గోవిందం సినిమాలతో హిట్ అందుకున్న రష్మికకు మహేష్ మూవీలో అవకాశం వచ్చింది.  


శ్రద్దా కపూర్ తో సినిమాలు చేసేందుకు మహేష్, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలంతా రెడీ గా ఉంటారు.  మరి ఈ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుందా లేదంటే.. సాహో సినిమాతో టాలీవుడ్ కు టాటా చెప్తుందా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: