ఆర్ఆర్ ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నాడు.  అంతకు ముందు చరణ్ బ్రూస్ లీ సినిమా చేశాడు. అది అనుకున్నంతగా హిట్ కొట్టలేదు.  పర్వాలేదనిపించింది.  డ్రామా ఎక్కువగా ఉండటమే ఆ సినిమాకు మైనస్ అయ్యింది. అమర్ అక్బర్ ఆంటోని సినిమా తరువాత శ్రీను వైట్ల చరణ్ కోసం కథను సిద్ధం చేసుకోవడం విశేషం.  


ఆ సినిమా ఫెయిల్ అయ్యినా.. వైట్లకు చరణ్ అవకాశం ఇచ్చాడు.  ఇందులో హీరోయిన్ గా రకుల్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది.  దే దే ప్యార్ దే సినిమా హిట్ కొట్టడంతో ఆమెకు ఈ అవకాశం వచ్చింది.  ఇంకా చెప్పాలంటే రకుల్ జీరో సైజ్ బాడీ చూసి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.  రకుల్ ప్రీత్ కు అవకాశం రావడంతో సంతోషంలో తేలిపోతుంది.  


రకుల్ సంతోషంలో తేలిపోతున్నది.  కానీ, సమంత మాత్రం చాలా కసితో కోపంగా ఉందట.  మొదట ఈ సినిమా కోసం సమంతను అనుకున్నారు. సమంత లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి.   సమంత వరసగా సినిమాలు చేస్తూ హిట్ హీరోయిన్ గా నిలిచింది.  ఈ హిట్ హీరోయిన్ ను కాదని చెప్పి రకుల్ ను తీసుకోవడంతో చరణ్ పై కోపం వచ్చిందట. 


అసలు సమంతను చరణ్ ఎందుకు కాదన్నాడు అంటే.. రకుల్ జీరో సైజ్ బాడీ ఉందని, దానికే చరణ్ ఓటు వేశాడని, అందుకే చరణ్ ... రకుల్ కు అవకాశం ఇచ్చాడని వార్తలు వచ్చాయి.  దీనికి రకుల్ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసి.. తానేం తక్కువ కాదని, అవసరం అనుకుంటే జీరో సైజ్ గా మారడానికి రెడీగా ఉన్నానని చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: