సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమా చేస్తోంది.  ఈ సినిమాపై భారీ ఆశలు ఉన్నాయి. జులై 12 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. తన సినిమాలు చేస్తూనే... బయట సినిమాలను సమంత ప్రోత్సహిస్తోంది.  నచ్చిన సినిమాను చూసిన తరువాత వాటి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. బాగుందని మెచ్చుకుంటోంది.  


ఇలా సమంత మెచ్చుకున్న సినిమాల్లో మరొకటి చేరింది.  అదే ఉయారే.  మలయాళంలో వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది.  సమంతకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చిందట.  దానికి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా సమంత స్పష్టంగా చెప్పింది. తనకు హీరోయిన్ చేసిన పార్వతి పాత్ర అద్భుతంగా నచ్చిందట. 

సినిమాలో హీరోయిన్‌ పైలెట్‌ కావాలనే లక్ష్యంతో, తన లక్ష్యానికి అడ్డుగా నిలిచిన ప్రేమికుడికి బ్రేకప్‌ చెప్పేస్తుంది.దాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ ప్రేమికుడు పార్వతిపై యాసిడ్‌ దాడికి దిగుతాడు. అయినా, ఆమె ఎంత మాత్రమూ కుంగిపోకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటుంది. 


అలా టార్గెట్‌ రీచ్‌ అయ్యే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఒత్తిడులూ, ఒడిదుడుకులూ, కష్ట నష్టాలూ సమంతను బాగా టచ్‌ చేశాయి. అందుకే ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడండి. ఫీల్‌ అవ్వండి అని అంటూ ట్వీట్ చేసింది.  సమంత ట్వీట్ కు పార్వతి స్పందించి... కృతజ్ఞతలు తెలియజేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: