సల్మాన్ భారత్ సినిమా ఈద్ రోజున రిలీజ్ అయ్యింది.  పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది.  ఇప్పటికే సినిమా అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తున్నది.  ఈ సినిమా ప్రచారంలో భాగంగా సల్మాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 


90వ దశకంలో క్రీడా రంగంలో సచిన్ టెండూల్కర్, సినిమా రంగంలో ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ లు సూపర్ స్టార్స్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. షారుక్, సచిన్ ల గురించి ఈ స్టార్ హీరో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.   90 వ దశకంలో షారుక్, సచిన్ లు స్టార్స్ గా ఎదిగారని వీరికి మించిన స్టార్ మరొకరు  ఉన్నారని సల్మాన్ పేర్కొన్నాడు.  


నా దృష్టిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రియల్ హీరో. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. 1991, 92 సంవత్సరాలలో మన్మోహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇండియా ఆర్థిక వ్యవస్థనే మార్చేసిందని సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.   


సల్మాన్ చేసిన ఈవ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.  సినిమాల గురించే తప్పా రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడని సల్మాన్, సడెన్ గా మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడటంతో అందరు షాక్ అయ్యారు. సల్మాన్ సినిమాల నుంచి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని, అందుకే ఆయన బాటను పదిలం చేసుకోవడానికి భారత్ ను ఇలా వాడుకున్నారని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: