కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రయోగాలు చేయడంలో దిట్ట.  సినిమాల విషయంలో వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తుంటాడు.  ఇక నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.  ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా.. మంచి పేరు తెచ్చిపెట్టాయి.  ఇప్పుడు ఈ హీరో కన్ను 400 కోట్ల రూపాయల సినిమాపై పడింది.  


2018లో వచ్చిన అంధాదున్ 400కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఆయుష్మాన్ ఖురానా కళ్లు లేనివాడిగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.  ఈ సినిమా ధనుష్ కు బాగా నచ్చింది. నచ్చితే ధనుష్ అస్సలు వదలడు.  దీని రీమేక్ హక్కులను సొంతం చేసుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.  అన్ని అనుకున్నట్టుగా జరిగితే ధనుష్, ఈ సినిమాను కోలీవుడ్ లో రీమేక్ అవుతుంది. 

ఇటీవల కాలంలో నేను ఎక్కువగా రీమేక్ చేయలేదు. ఇప్పుడు అంధాదు చేయాలనీ అనుకుంటున్నా. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తానని ధనుష్ వివరణ ఇచ్చాడు. ధనుష్ ఈ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు అనే టాక్ బయటకు రావడంతో కోలీవుడ్ లో అప్పుడే సందడి వాతావరణం నెలకొంది.  ధనుష్ లాంటి హీరోకు ఈ సినిమా కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది.  


అయితే ఎవరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు అన్నది తెలియాలి.  ధనుష్ దర్శకుల లిస్ట్ లో కొంతమంది టాప్ దర్శకులు ఉన్నారు.  వారిలో ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ ను అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: