‘బాహుబలి’ రికార్డులతో సరిసమానంగా కలక్షన్స్ రాబట్టాలని రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ తో చేస్తున్న మాస్టర్ ప్లాన్ కు రకరకాల అడ్డంకులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక దగ్గర నుండి ఈ మూవీ స్క్రిప్ట్ వరకు ఎన్నో విషయాలలో రాజమౌళికి కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. 

దీనికితోడు ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీ నిర్మాత దానయ్య నిర్మిస్తూ ఉండటంతో సహజంగానే అతడి పై కొందరికి ఇండస్ట్రీ వర్గాలలో జెలసీ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జెలసీ తో కొందరు రాజమౌళి దానయ్యల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
 
ఇది ఇలా ఉంటే ఈమూవీ ప్రొడక్షన్ తో పాటు బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాల్లో దానయ్యకు రాజమౌళి కి మధ్య ఏవో విభేదాలు వచ్చాయనే టాక్ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. బయటికి చెప్పకపోయినా నివురు గప్పిన నిప్పులా ఈవిషయం గాసిప్పుల రూపంలో ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. 

దీనితో అటు రాజమౌళికి ఇటు దానయ్యకు సన్నిహితుడైన ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి వీరిద్దరి మధ్యా రాయబారాలు చేస్తూ ఏర్పడిన ఈ చిన్న భేదాభిప్రాయాలు పెద్దవి కాకుండా ఆదిలోనే చెక్ పెట్టడానికి కొర్రపాటి సాయి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించి బిజినెస్ డీల్స్ ను ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత మాత్రమే ఫైనల్ చేద్దామని రాజమౌళి ఆలోచన అయితే ఇప్పటి నుంచే బిజినెస్ డీల్స్ వ్యవహారం ఓపెన్ చేద్దామని దానయ్య ఆలోచనలో ఉండటంతో ఈ భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు టాక్. దీనితో ఈ సున్నిత విషయాలు ఎలా పరిష్కారం అవుతాయి అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి..     


మరింత సమాచారం తెలుసుకోండి: