అక్కినేని నాగార్జున మన్మధుడు 2 సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఇదిలా ఉంటె, మన్మధుడు 2 లో యంగ్ అండ్ ఫ్రెష్ లుక్ లో కనిపించేందుకు నాగార్జున చాలా ట్రై చేశాడు.  

ఏకంగా బరువు తగ్గి యంగ్ లుక్ లోకి మారిపోయాడు.  నాగ్ ను చూసిన ప్రతిఒక్కరు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.  అదేంటి ఫొటోలో ఉన్నది నాగార్జున కాదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  నాగ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు.  మన్మధుడు క్లాసికల్ హిట్.  ఆ హిట్ మూవీకి సీక్వెల్ చేయడం అంటే దానికి మించి ఉండాలి.  

అంతేకాని, దాని పేరును చెడగొట్టే విధంగా ఉండకూడదు. అందుకే దానికోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక్కడ మరోవిషయం ఏమిటంటే.. మన్మధుడు సినిమాలో ఇద్దరే హీరోయిన్లు.  ఇందులో అంతకు మించి అనేలా ఉన్నది.  రకుల్ మెయిన్ లీడ్ రోల్ చేస్తుంటే... సమంత ఓ కీలక పాత్ర చేస్తోంది.  

మరోవైపు కీర్తి సురేష్ కూడా ముఖ్యభూమికను పోషిస్తున్నది.. సోగ్గాడే చిన్నినాయనా తరువాత నాగ్ కు మంచి హిట్ లేదు.  సో, ఈ సినిమాతో మళ్ళీ హిట్ బాటలోకి రావాలని చూస్తున్నాడు ఈ అల్లరి అల్లుడు.  ఇది పూర్తైన వెంటనే నాగ్ బంగార్రాజు మొదలుపెడతాడు.  ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా కీలక పాత్ర చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: